హాస్టల్ విద్యార్థులకు మెనూను మార్చేశామని.. ప్రతి విద్యార్థికి హెల్త్ కార్డు ఇస్తామని.. ప్రతి నెలా చెకప్ చేయిస్తామని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. పేదల కష్టాలు ఏంటో మాకు తెలుసన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా హాస్టల్ విద్యార్థులకు ఛార్జీలు పెంచామన్నారు. ముఖ్యమంత్రి, అధికారులతో పూర్తి స్థాయిలో చర్చించిన అనంతరం 40 శాతం వరకు విద్యార్థులకు అందించే ఛార్జీలు పెంచామన్నారు
నెహ్రూ జయంతిని పురస్కరించుకుని నిర్వహించే జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి బాలబాలికలు అందరికీ హార్ధిక శుభాకాంక్షలు తెలియజేశారు. నేటి బాలబాలికలే భావి భారత పౌరులని విశ్వసించి ప్రజా ప్రభుత్వం పాఠశాల విద్యా రంగంలో వినూత్నమైన మార్పులకు శ్రీకారం చుట్టిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
ప్రభుత్వం, ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులను ఎంపిక చేయడానికి ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు అధికారులను శనివారం సాయంత్రం లోగా కమిటీలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. గ్రామ పంచాయతీ పరిధిలో సర్పంచ్ లేదా ప్రత్యేక అధికారిని చైర్మన్‌గా నియమించనున్నారు. కమిటీలో ఇద్దరు స్వయం సహాయక సంఘాలకు చెందిన మహిళలు, ముగ్గురు పురుషులు సభ్యులుగా ఉంటారు. ఇందులో ఒకరు బీసీ, మరొకరు ఎస్సీ లేదా ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారు తప్పనిసరిగా ఉండాలి. ఈ కమిటీకి పంచాయతీ…
కృష్ణాజిల్లాలోని నిమ్మకూరులో ఎన్టీఆర్, బసవతారకం విగ్రహాలకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. పేదరిక నిర్మూలనకు తెలుగుదేశం మినీ మేనిఫెస్టోలో పెట్టిన పూర్ టు రిచ్ లక్ష్యాలను ఆవిష్కరించారు.