జనాభా పెంపుదల పై ఏపీ సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు.. దేశానికి సౌత్ ఇండియా మార్గదర్శనం చేసే పరిస్థితి ఉంది.. మనం ప్రస్తుతం ఆలోచించాల్సింది పాపులేషన్ మేనేజ్‌మెంట్‌పైనే.. లేదంటే నార్త్ ఇండియా పాపులేషన్ పెరిగితే అక్కడనుంచి ఇక్కడకు మైగ్రేషన్ పెరుగుతుందన్నారు.. చదువుకునే మీరంతా పిల్లలు లేకుండా లైఫ్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు.. కానీ, ఆ ఆలోచన విరమించుకుని జనాభా పెంపుదలపై దృష్టి పెడితే మనమే ప్రపంచాన్ని శాసిస్తాం అని ఆసక్తికర కామెంట్లు చేశారు..
Elon Musk: భారత్, చైనా సహా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో జనాభా క్రమంగా క్షీణించడంపై అపర కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాడు. ఇది ప్రపంచం ఎదుర్కొనే అత్యంత తీవ్రమైన సవాళ్లలో ఒకటని చెప్పుకొచ్చాడు.
Population Increased: చైనాలో జననాల రేటు గత రెండు సంవత్సరములుగా నిరంతరం తగ్గుతోంది. ఈ పరిస్థితిలో చైనా అనేక విధానాలను ప్రకటించింది. ఇందులో పిల్లల పుట్టుకపై సబ్సిడీ విధానం, అలాగే ఎక్కువ మంది పిల్లలను కలిగి ఉన్న కుటుంబ సభ్యులకు పన్ను తగ్గింపు వంటి విధానాలు ఉన్నాయి. జననాల రేటును పెంచడానికి, ఎక్కువ మంది పిల్లలను కలిగి ఉండేలా ప్రజలను ప్రోత్సహించడం దీని లక్ష్యం. పిల్లల జనన రేటును పెంచేందుకు వీలుగా చైనా స్టేట్ కౌన్సిల్ సోమవారం…
చైనా చాలా కాలంగా జనాభా రేటు తగ్గుదలపై ఆందోళన చెందుతోంది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన రెండో దేశమైన చైనా ఈ సమస్యను అధిగమించేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఈ ప్రయత్నాల వల్ల సామాన్యులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జనాభా రేటును పెంచడానికి చైనా అనేక చర్యలు తీసుకుంటోంది.. జనాభాకు ఆకర్షణీయమైన వాగ్దానాలు చేస్తోంది. జనాభాను పెంచేందుకు వీలుగా వివాహ ప్రక్రియను సులభతరం చేసి.. విడాకుల అంశాన్ని సంక్లిష్టం చేయాలని కమ్యూనిస్ట్ ప్రభుత్వం నిర్ణయించింది.
హాంగేరీ ప్రధాని విక్టోర్ అర్బన్ వినూత్న ఆలోచనతో కనీసం నలుగురు లేదా అంతకంటే ఎక్కువ మందిని కనే మహిళలకు తమ జీవితకాలం వ్యక్తిగత ఆదాయ పన్ను చెల్లింపు నుంచి మినహాయింపు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
NCDC Report : జనావాసాల నుండి అడవుల దూరం తగ్గుతున్నందున, జంతువుల నుండి మానవులకు వ్యాపించే జూనోటిక్ వ్యాధులు కూడా పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు దేశంలోని 29 రాష్ట్రాలు ఈ వ్యాధుల బారిన పడ్డాయి.
China: పొరుగు దేశమైన చైనా ప్రస్తుతం గగ్గోలు పెడుతోంది. ఆ దేశంలో నానాటికీ వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. సంతానోత్పత్తి విపరీతంగా పడిపోయింది. పిల్లలను కనడమే అక్కడ జనం మానేశారు. దీని ప్రభావం అక్కడి దేశ ఆర్థిక వ్యవస్థపై కనిపిస్తుండటంతో చైనా ప్రభుత్వం కూడా ఆందోళన చెందుతోంది.
ప్రతి ఏటా జులై 11న ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఇది ప్రపంచ జనాభాలో పెరుగుతున్న సవాళ్లు, ప్రభావాలపై అవగాహన పెంచడానికి ఉద్దేశించిన ప్రపంచ కార్యక్రమం. మానవుల పెరుగుతున్న జనాభా చాలా ఆందోళన కలిగించే విషయంగా పేర్కొనబడింది. అందుకే ప్రపంచ జనాభాకు సంబంధించిన సామాజిక, ఆర్థిక, పర్యావరణ పరిణామాల వంటి ప్రబలమైన సమస్యలను విశ్లేషించడానికి ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరుపుకుంటారు.
China Birth Rate: ప్రస్తుతం దేశంలో తగ్గుతున్న జననాల రేటుపై చైనా ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. జననాల రేటును పెంచేందుకు అక్కడి ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది.