Bumper Offer : సిక్కిం రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. నానాటికి తగ్గిపోతున్న తమ జాతి జనాభాను పెంచుకునేందుకు సిక్కిం సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్ కొత్త రకం పాలసీ తీసుకురానున్నారు.
BJP MP Ravi Kishan: యూపీలోని గోరఖ్‌పూర్ బీజేపీ ఎంపీ రవికిషన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తనకు నలుగురు పిల్లలు ఉండటం తన తప్పు కాదని.. జనాభా నియంత్రణ బిల్లు తీసుకురాని కాంగ్రెస్ పార్టీదే ఆ తప్పు అని రవికిషన్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఒకవేళ జనాభా నియంత్రణ బిల్లు తెచ్చి ఉంటే తనకు నలుగురు కంటే తక్కువ పిల్లలు ఉండేవారని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం జనాభా నియంత్రణ బిల్లుపై కసరత్తు చేస్తోందని…
నవంబర్ 15 నాటికి ప్రపంచ జనాభా ఎనిమిది బిలియన్లకు చేరుకుంటుందని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. 2023లో ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా చైనా స్థానంలో భారత్ అవతరించనుందని నివేదికలో పేర్కొంది. ప్రపంచ జనాభా మంగళవారం నాటికి 8 బిలియన్ల మందికి చేరుకుంటుందని అంచనా.
india and china population decreased by year of 2100: ప్రపంచంలో జనాభా పరంగా భారత్ రెండో స్థానంలో ఉంది. చైనా అగ్రస్థానంలో కొనసాగుతోంది. 2022 లెక్కల ప్రకారం చైనాలో జనాభా 142.6 కోట్లుగా ఉంటే భారత్ జనాభా 141.2 కోట్లుగా ఉంది. అయితే ఓ సర్వే ప్రకారం 2100 నాటికి చైనా జనాభా 49.4 కోట్లకు తగ్గిపోనుంది. అంతేకాకుండా భారత్‌లో కూడా జనాభా 100.3 కోట్లకు చేరనుంది. అంటే భారత్‌లో జనాభా 41 కోట్లు…
కొన్ని సంవత్సరాల నుంచి భారత్ జనాభా గణనీయంగా పెరుగుతూ వస్తోంది. ఈ క్రమంలోనే వచ్చే ఏడాది నాటికి చైనాను దాటి.. భారత్ ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా నిలవనుందని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. జులై 11న ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ఐరాస సోమవారం 2022 ప్రపంచ జనాభా అంచనాల నివేదికను విడుదల చేసింది. ఈ ఏడాది నవంబర్‌కల్లా ప్రపంచ జనాభా 800 కోట్ల మార్క్‌ను తాకే అవకాశం ఉందని, ఇప్పుడు రెండో స్థానంలో ఉన్న…
బీహార్‌లో కులాల వారీగా జనగణన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే దీనిపై అక్కడి ప్రభుత్వంలోనే భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. బీహార్‌లో అక్రమంగా నివసిస్తున్న రోహింగ్యాలు, బంగ్లాదేశీ ముస్లింలను కూడా లెక్కించాలని మంత్రి నీరజ్ కుమార్ సింగ్ బబ్లూ తాజాగా డిమాండ్ చేశారు. ముస్లిం కమ్యూనిటీకి చెందిన కొందరికి ముగ్గురు భార్యలు, 15-20 మంది వరకు పిల్లలు ఉన్నారని.. వారు జనాభా లెక్కల నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. జనాభా లెక్కల్లోకి రాకూడదన్నది వారి ఆలోచన…
దేశంలో జనాభా నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వం త్వరలోనే కొత్త చట్టం తేనుందని కేంద్రమంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో గరీబ్ కళ్యాణ్ సమ్మేళన్‌లో పాల్గొన్న ఆయన ఈ మేరకు ప్రకటన చేశారు. దేశంలో రోజు రోజుకు జనాభా పెరిగిపోతుండటంతో అనేక సమస్యలు వస్తున్నాయి. జనాభా పెరుగుదలతో సంక్షోభం కూడా తలెత్తే అవకాశం ఉంది. దీంతో జనాభా నియంత్రణపై ఎలా చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలంటూ కేంద్రమంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్‌ను మీడియా ప్రశ్నించింది.…