ఇదిలా ఉంటే.. హనుమకొండలోని డీ కన్వెన్షన్ హాలులో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని తెలంగాణ ఉద్యమ కారులకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్, సీతక్క, ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి, గండ్ర సత్యనారాయణ, నాగరాజు, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రొఫెసర్ కోదండరాం, మాజీ ఎంపీలు మధు యాష్కీ గౌడ్, సిరిసిల్ల రాజయ్య, సీతారాం నాయక్,…
Ponnam Prabhakar: మాకు గత పదేళ్లలో ఒక్క ఆహ్వాన పత్రిక రాలేదు.. కానీ.. మాజీ ముఖ్యమంత్రిని కూడా మేము ఆహ్వానం పంపామమని రవాణా, బీసీ సంక్షేమ శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Ponnam Prbhakar: బండిసంజయ్ మత రాజకీయాలు చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. కరీంనగర్ లో ఆయన మాట్లాడుతూ.. నాలుగు నెలల క్రితం ఏర్పడిన ప్రజల ప్రభుత్వంపై పిల్లి శాపనార్ధాలు పెడుతూ పడగొడతాం అని అంటున్నారని మండిపడ్డారు.
Ponnam Prabhakar: బీజేపీ పొరపాటుగా గెలిస్తే మన రిజర్వేషన్లు , మనతో పాటు ఎస్సి ఎస్టీ ల రిజర్వేషన్లు తొలగించే కుట్ర జరుగుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ తిరుమల గార్డెన్‌లో సీపీఐ కార్యకర్తల సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే గా గెలవడానికి సహకరించిన మీ అందరికి ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇప్పటికే మద్దతు కోరుతూ సిపిఐ నేతలను కలిశారని, భవిష్యత్ లో హుస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించి సిపిఐ కాంగ్రెస్ మధ్య ఎలాంటి బిఫభిప్రాయాలు ఉండవని ఆయన తెలిపారు.…
తమ ప్రభుత్వం రైతుల పక్షపాతి అని రైతులందరికీ రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాలో జమ చేస్తుంటే బీజేపీ, బీఆర్ఎస్‌లు ఓర్చుకోలేక పోతున్నాయనీ మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. అందరికీ రైతు భరోసా విడుదల చేయాలని తమ ప్రభుత్వం భావిస్తుంటే కావాలని ప్రతిపక్ష పార్టీలు దానిని అడ్డుకున్నాయన్నారు. నిన్న ఒక్కరోజే 900 కోట్లు రైతుల ఖాతాలో వేసామన్నారు..రైతు భరోసా ను ఆపాలని ఎన్నికల కమిషన్ కి పిర్యాదు చేశాయనీ పేర్కొన్నారు. దీంతో ఎన్నికల వరకు రైతు భరోసా…
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్లకు మంత్రి పొన్నం ప్రభాకర్ బహిరంగ లేఖ రాశారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్కు నేను అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పండని అన్నారు. బీజేపీ రిజర్వేషన్లకు సంబంధించి మొసలి కన్నీరు కారుస్తూ.. రిజర్వేషన్లకు వ్యతిరేక ఉండే బీజేపీ బీసీ, ఎస్సీ, ఎస్టీల ఓట్లు అడిగేహక్కు లేదని అన్నారు. రిజర్వేషన్లను రద్దు చేయడానికి బీజేపీ కుట్ర చేస్తుందని తెలిపారు. తాము మండల కమిషన్ అమలు…
తెలంగాణ రావడానికి కారణం కేసీఆర్, సిద్దిపేట గడ్డ సిద్దిపేటకి కేసీఆర్, హరీష్ రావు ఏం చేశారని రేవంత్ చెబుతున్నారని, కళ్ళుండి సీఎం రేవంత్ రెడ్డి చూడలేకపోతున్నారా అర్థం కావట్లేదన్నారు హరీష్ రావు. జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి అవార్డులు లేకుండా సిద్దిపేట లేదని, సిద్దిపేట అభివృద్ధి కాలేదని సీఎం రేవంత్ పచ్చి అబద్దాలు మాట్లాడారన్నారు హరీష్. తెలంగాణ రావడానికి కారణం కేసీఆర్, సిద్దిపేట గడ్డ అని, రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడంటే కారణం సిద్దిపేట అని ఆయన…
Ponnam Prabhakar: కనీసం నీకు హిందీ ఇంగ్లీష్ రాని నిన్ను కరీంనగర్ ఎంపీగా చెప్పుకోవడం సిగ్గుగా ఉందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
జగిత్యాల జిల్లా నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గంలో జన జాతర సభలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ఉత్తర తెలంగాణకే అనేక సందర్భాల్లో రాజకీయ సలహాలతొ పాటు ప్రజా సమస్యల పై పోరాట మార్గాన్ని ఇచ్చిన పెద్దలు జీవన్ రెడ్డిని నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి గా గెలిపించండన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని ఆయన అన్నారు. 30 సంవత్సరాల తరువాత బీజేపీ ఎవరి సహకారం లేకుండా…