హైదరాబాద్ బస్ భవన్లో శనివారం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్ఆర్టీసీ) పనితీరుపై రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో సంస్థలోని అన్ని విభాగాల పనితీరు.. మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్య పథకం అమలు, కొత్త బస్సుల కొనుగోలు, ఆర్థికపరమైన అంశాల గురించి అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా మంత్రికి వివరించారు.
Peddapalli: ఇవాళ పెద్దపల్లి జిల్లాలో మంత్రుల బృందం పర్యటించనున్నారు. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు..
Mayor Sunil Rao: నగరపాలక కార్పోరేటర్లు బండిసంజయ్ కలిస్తే తప్పేముందని కరీంనగర్ జిల్లా మేయర్ సునీల్ రావు ఫైర్ అయ్యారు. స్మార్ట్ సిటి కోసం 735 కోట్లు ఖర్చు చేసామని తెలిపారు.
Komatireddy: అప్పుల్లో ఉన్న ఆర్టీసీని గటెక్కించేందుకు పొన్నం అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లాలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, పొన్నం ప్రభాకర్ పర్యటించారు.
గోల్కొండ కనకాల కట్ట మైసమ్మ దేవాలయంలో తెలంగాణ కుమ్మర్ల తొలి బోనాల జాతర జరిగింది. ముఖ్య అతిథిగా మంత్రులు కొండా సురేఖ, హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్,జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయ లక్ష్మి హాజరయ్యారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి ఘటాలు సమర్పించుకున్నారు మంత్రులు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఆషాఢ మాస బోనాల దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తొలి కుమ్మర్ల బోనం ఈరోజు కట్ట మైసమ్మ అమ్మవారికి…
కరీంనగర్ జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో 2019 నుండి 2024 వరకు పదవి బాధ్యతలు పూర్తి చేసుకున్న జడ్పీ చైర్మన్, జడ్పీటిసి, ఎంపిపి లకు ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రవాణా , బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ కనుమల్ల విజయ గణపతి, వైస్ చైర్మన్ పెరాల గోపాల్ రావు , జడ్పీటిసి, ఎంపిపి లను ఘనంగా సత్కరించారు మంత్రి పొన్నం…
Ponnam Prabhakar: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ)లో ఖాళీగా ఉన్న 3035 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు.
తమిళనాడు రాష్ట్రం లో తెలంగాణ రవాణా శాఖ అధికారుల అధ్యయనం చేసింది. తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రవాణా శాఖ కమిషనర్ జ్యోతి బుద్ధ ప్రకాష్ IAS ఆదేశాల మేరకు తెలంగాణ రవాణా శాఖ అధికారుల బృందం రంగారెడ్డి జిల్లా డిప్యూటి ట్రాన్స్ పోర్ట్ కమీషనర్ మామిండ్ల చంద్ర శేఖర్ గౌడ్ , ఉప్పల్ ఆర్టీవో వాణి, కామారెడ్డి ఎం వి ఐ జింగ్లి శ్రీనివాస్ లు ఈ రోజు తమిళ నాడు రాష్ట్రం…
కొత్తగూడెం పర్యటనకు బయలుదేరిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కొత్తగూడెం పర్యటనకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు బయలుదేరారు. ఆయనతో పాటు.. మంత్రులు కోమటిరడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస రెడ్డి బేగంపేట విమానాశ్రయం చేరుకున్నారు. నేడు కొత్తగూడెంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఉదయం 11-00గంటలకు రూ.4కోట్ల రూపాయల DMFT నిధులతో బైపాస్ రోడ్డు నుంచి జివి మాల్ వరకు చేపట్టనున్న డ్రైన్ నిర్మాణ పనులు శంకుస్థాపన…
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దేవాలయంలో ఆషాఢ మాసం బోనాల జాతర మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయ లక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి ,దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ ,సెక్రటరీ హన్మంతరావు , సనత్ నగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కోటా నీలిమ,మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ ,దేవాలయ కమిటీ ,ఇతర స్థానిక ముఖ్యనేతలు.. పోలీస్…