కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తూలపూర్‌లో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్డు షో, కార్నర్ మీటింగ్ లో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారయణ, ఎంపీ అభ్యర్థి వెలిశాల రాజేందర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. 10 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రాన్ని మొత్తం లూటీ చేసిందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక చూస్తే గల్లపెట్టల్లో పైసలు లేవని, ఎన్నికల హామీలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను 100…
వైసీపీ మేనిఫెస్టోకు తుది మెరుగులు.. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ అడుగులు వెస్తోంది. మరోసారి అధికారాన్ని దక్కించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. దీనిలో భాగంగానే వైసీపీ మ్యానిఫెస్టోను మెరుగులు దిద్దేందుకు పార్టీ నాయకులు పూనుకున్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో ఇవాళ అంతర్గత సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ రోజంతా సీఎం మ్యానిఫెస్టోపై చర్చిస్తారు. నూతన అంశాలు, కొత్త పథకాలపై కసరత్తు చేస్తారు. ఈ నేపథ్యంలో కొందరు ముఖ్య నేతలు జగన్ ను కలిశారు.…
పార్లమెంటు మొదటి ధశ ఎన్నికలు కాగానే మోడికి భయం పట్టుకుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆయన మండిపడ్డారు. అదానీ, అంబానీకి తప్పా సామాన్యుడికి న్యాయం జరగలేదని ఆయన వ్యాఖ్యానించారు. పదేండ్లలలో బీఅర్ఎస్, బీజేపి ఏమి చేయలేదని ఆయన అన్నారు. బండిసంజయ్ పై అవినీతి, ఆరోపణలు వచ్చాయి కాబట్టే రాష్ట్ర అధ్యక్ష పదవి నుండి తొలగించారని, తల్లికి గౌరవం ఇవ్వని అవివేకి బండిసంజయ్ అని ఆయన…
బండి సంజయ్ సమక్షంలో హుస్నాబాద్‌కు చెందిన పలువురు మాజీ సర్పంచులు బీజేపీలో చేరారు. ఈ నేపథ్యంలో బండి సంజయ్ ప్రసంగించారు. ఎకరాకు రూ.14 వేల బోనస్ ఎందుకివ్వడం లేదని.. తాలు, తరుగు, తేమతో పనిలేకుండా వడ్లు ఎందుకు కొనడం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని బండి సంజయ్ ప్రశ్నించారు.
Ponnam Prabhakar: తల్లిని రాజకీయాలకు తల్లిని ఎందుకు లాగుతున్నారు అంటూ బండి సంజయ్ పై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. కరీంనగర్ జిల్లా అంబేద్కర్ స్టేడియంలో మంత్రి పొన్నం మార్నింగ్ వాక్ చేస్తూ ప్రజలతో ముచ్చటించారు.
Ponnam Prabhakar: బలహీన వర్గాలు ఆలోచించండి ... ఎన్నికల్లో కాంగ్రెస్ కి అండగా నిలబడాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బీజేపీ బలహీన వర్గాల వ్యతిరేకి..వారి మేనిఫెస్టోలోని 14 అంశాల్లో ఒక్కటి కూడా బలహీన వర్గాలకు సంబంధించి లేదన్నారు.
Ponnam Prabhakar: ఇవాళ మంత్రి పొన్నం ప్రభాకర్ దీక్ష చేయనున్నారు. కరీంనగర్ జిల్లాలోని కాంగ్రేస్ కార్యాలయంలో ఆయన దీక్ష చేపట్టనున్నారు. పదేళ్ల బీజేపీ ప్రభుత్వ పాలనలో వైఫల్యాలపై దీక్ష చేపట్టనున్నట్లు పొన్నం ప్రకటించారు.
పదేండ్లు తెలంగాణకు బీజేపీ ప్రభుత్వం చేసిన అన్యాయంపై దీక్ష చేస్తానని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈనెల 14న కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో ఉదయం 11 గంటలనుండి మధ్యాహ్నం 1 గంటల వరకు దీక్ష చేపడతామని తెలిపారు.