Ponguleti Srinivasa Reddy: తెలంగాణ రాష్ట్రం పునర్నిర్మాణ దిశగా నడుస్తుందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో పేదల పాలన, కలల సాధనకు ప్రభుత్వం కట్టుబడిందని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. తాజాగా నిర్వహించిన సభలో ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. మీ అందరి దీవెనలతో ఇందిరమ్మ రాజ్యం వచ్చింది.. రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత కష్టం వచ్చినా పేదవాడి కళలను సహకారం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్యంలో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన అన్నారు. రాష్ట్రానికి భారీగా అప్పు ఉన్న.. పేద ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేస్తున్నామన్నారు. గత పది సంవత్సరాలలో BRS ప్రభుత్వం విద్యను నిర్వర్ణ్యం చేశారు. కానీ, సీఎం రేవంత్ రెడ్డి నేతృత్యంలో విద్యకు పెద్ద పీట వేస్తున్నామని అన్నారు.
Read Also: Nithin : క్షమించండి.. ఇక నుంచి మంచి సినిమాలు చేస్తా
కేంద్ర ప్రభుత్వం పాలిస్తున్న రాష్ట్రాలలో కూడా సన్న బియ్యం ఇవ్వడం లేదు.. మన రాష్ట్రంలో ఇస్తున్నట్లు ఆయన పేర్కోన్నారు. ఎన్నికల ఉన్నప్పుడే గత ప్రభుత్వం రేషన్ కార్డులు ఇచ్చారు, ఇప్పుడు ఉన్న ఇందిరమ్మ రాజ్యం ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకున్నా, రైతుల ఖాతాలో రైతుబంధు డబ్బులు వేశాం. ధరణిని బంగాళాఖాతంలో కలిపి రైతుల కోసం భూభారతి చట్టం తీసుకువచ్చి రైతులకు మేలు చేశామన్నారు.
Read Also:Captain Cool: ‘కెప్టెన్ కూల్’ ట్యాగ్‌లైన్‌కు ధోనీ ట్రేడ్‌మార్క్ దరఖాస్తు..!
మొదటి విడతగా రాష్ట్రవ్యాప్తంగా నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇళ్లను ఇచ్చాం.. 10 సంవత్సరాలు పరిపాలించిన పెద్దలు, కాలేశ్వరం పేరుతో లక్షల కోట్లు అవినీతి చేశారు. BRS పార్టీ వాళ్లకు పదవి లేకపోయి సరికి పేద ప్రజలపై ముసలి కన్నీరు కారుస్తున్నారని అన్నారు. కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. ఖమ్మం జిల్లా నుండి BRS పార్టీ వారు అసెంబ్లీ గేటు తాకనీయను అని వాగ్దానం చేశాను.. ఒక్కరు గేటు తాకలేదని అన్నారు.