Minister Ponguleti: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా అసెంబ్లీలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో 12, 500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశాం.. చెంచులు అందరికీ మొదటి విడతలోనే ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చాం.. ఆగిపోయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు నిధులు ఇస్తున్నామని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు.
Read Also: The Raja Saab: ప్రభాస్‌ను వదిలే ప్రసక్తే లేదు.. ముగ్గురు భామల మధ్య డార్లింగ్‌ను ఆడేసుకోనున్న వంగా!
అలాగే, సింగరేణి ప్రాంతాల్లో పట్టాల పంపిణీపై కూడా త్వరలో కేబినెట్ సమావేశంలో చర్చిస్తామని మంత్రి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. అయితే, గత ప్రభుత్వం పింక్ కలర్ షర్ట్ ఉంటేనే ఇళ్లు ఇచ్చింది.. గత సర్కార్ కమీషన్ల కోణంలోనే ఇళ్లను పంపిణీ చేసిందని పొంగులేటి సంచలన ఆరోపణలు చేశారు. మరో మూడు విడతల్లో ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు.