TS Congress: తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ గేరు మార్చింది. ఈసారి ఎలాగైనా గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది.
Ponguleti: త్వరలో ఫ్లో మొదలవుతుంది.. పాలమూరు సభ..ఖమ్మంని మరిపించేలా ఉంటుందని కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సిఎల్పీ నేత భట్టి విక్రమార్కను ఆయన నివాసంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భేటీ అయ్యారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఎవ్వరినీ గెలువనియ్యను అని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ నేతలకు దడ పుట్టింది.. చావు నోటి వరకు వెళ్లి తెలంగాణ తీసుకుని వచ్చనన్ని కేసీఆర్ చెబుతుంటారు.. అనాడు పండ్ల రసం డ్రింక్ త్రాగింది నిజం కదా.. ఉద్యమంలో యాక్టింగ్ చేశావు తప్ప మరేమీ లేదు అని పొంగులేటి అన్నారు. ఖమ్మం ఎమ్మెల్యే ప్రజలను భయ బ్రాంతులను చేయడంలో నిష్ణాతులు అని ఆయన తెలిపారు.
డిసెంబర్ 9న తెలంగాణ ప్రకటన వచ్చిందని.. ఈ డిసెంబర్ 9న కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుందని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. డిసెంబర్ 9న విజయోత్సవ సభ ఖమ్మంలోనే ఉంటుందన్నారు. సంక్షేమం, అభివృద్ధి బాధ్యతను కాంగ్రెస్ తీసుకుంటుందన్నారు.
పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నామని రాహుల్ గాంధీ అన్నారు. భట్టి పాదయాత్ర చేసినందుకు అభినందిస్తున్నామన్నారు. భారత్ జోడో యాత్ర తర్వాత తెలంగాణకు వచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు.
ఈసారి ఎలాగైనా తెలంగాణలో అధికారంలోకి రావాలని భావిస్తున్న కాంగ్రెస్.. గతానికి భిన్నంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఆపరేషన్ ఆకర్షన్తో పలువురిని పార్టీలోకి రప్పించే పనిలో ఉండగా... పొంగులేటి, జూపల్లితో పాటు ఇతర నేతలను పార్టీలోకి రప్పించటంలో విజయవంతం అయింది.
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఖమ్మంలో జరగనున్న కాంగ్రెస్ జన గర్జన సభకు ఏర్పాట్లు చేశారు. ఖమ్మం నగరంలో కాంగ్రెస్ ఫ్లెక్సీలు వెలిశాయి. ఈ సభకు ఖమ్మంతోపాటు మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల నుంచి పెద్ద ఎత్తున జనాన్ని తరలించేందుకు పార్టీ నేతలు, క్యాడర్ ఏర్పాట్లు చేస్తున్నారు.