Ponguleti: త్వరలో ఫ్లో మొదలవుతుంది.. పాలమూరు సభ..ఖమ్మంని మరిపించేలా ఉంటుందని కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సిఎల్పీ నేత భట్టి విక్రమార్కను ఆయన నివాసంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భేటీ అయ్యారు. ప్రజలు ఏం కోరుకుంటున్నారో..అది నెరవేర్చాలి అనేదే మా అజెండా అని తెలిపారు. అంతకు మించి ప్రత్యేక అజెండా లేదని తెలిపారు. పదవులు..కమిటీల ఆలోచనే లేదన్నారు. కేసీఆర్ ని ఇంటికి పంపించడమే ప్రధాన అజెండా అని అన్నారు. జగన్ ని నేను కలవలేదన్నారు. సీఎం ఆఫీస్ కి వెళ్లినా.. అధికారులను కలిశా అన్నారు. జగన్ ని కలిసినప్పుడు కూడా ఆయన పార్టీకి.. తెలంగాణ మీద ఆలోచనే లేదన్నారు. షర్మిల కాంగ్రెస్ లో చేరే అంశం నా దృష్టిలో లేదని తెలిపారు. మోడీ సభ ను కేసీఆర్ బహిష్కరణ చేశారా? నటించారా? అని ప్రశ్నించారు. మోడీ..కేసీఆర్ మధ్య నువ్వు కొట్టినట్టు..నేను ఏడ్చినట్టు చెయ్ అన్నట్టు ఉంది బంధం అని వ్యంగాస్త్రం వేశారు. బీఆర్ఎస్ నుండి కూడా కాంగ్రెస్ లో చేరికలు ఉంటాయని తెలిపారు. త్వరలో ఫ్లో మొదలవుతుందని అన్నారు. పాలమూరు సభ.. ఖమ్మంని మరిపించేలా ఉంటుందన్నారు.
Read also: Teachers Strike: దంపతుల ధర్నాతో దద్దరిల్లిన ధర్నా చౌక్.. బోనాలతో ప్రత్యేక ర్యాలీ..
భట్టి మాట్లాడుతూ.. పొంగులేటి మర్యాద పూర్వకంగా కలిశారని అన్నారు. జిల్లా రాజకీయాలపై చర్చ చేశామన్నారు. ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఎలా అనే దానిపై చర్చ చేశామన్నారు. బీఆర్ఎస్ ను బంగాళాఖాతంలో పడేసి అధికారంలోకి వస్తామన్నారు. ఎలా రావాలి అనే దానిపై చర్చించామన్నారు. తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చడం కాంగ్రెస్‌తోనే సాధ్యమని అన్నారు. కేసీఆర్ అవినీతికి పాల్పడితే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? కొల్లాపూర్‌లో నిర్వహించే భారీ బహిరంగ సభ తేదీలను ప్రకటిస్తామని తెలిపారు. సభ తేదీ.. ఏఐసీసీ త్వరలో ప్రకటిస్తారని స్పష్టం చేశారు. త్వరలోనే రాహుల్ గాంధీని కలుస్తానని అన్నారు. పాదయాత్ర పై బుక్ రిలీజ్ చేస్తామన్నారు. మోడీ..కేసీఆర్ ఒక్కటే అన్నారు.
Pawan Kalyan: పవన్ వ్యాఖ్యలపై వాలంటీర్ల ఆగ్రహం.. రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, ఆందోళనలు