Revanth Reddy: డిసెంబర్ 9న తెలంగాణ ప్రకటన వచ్చిందని.. ఈ డిసెంబర్ 9న కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుందని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. డిసెంబర్ 9న విజయోత్సవ సభ ఖమ్మంలోనే ఉంటుందన్నారు. సంక్షేమం, అభివృద్ధి బాధ్యతను కాంగ్రెస్ తీసుకుంటుందన్నారు. 1200 మంది ఆత్మబలిదానాలను చూసి సోనియా చలించిపోయారని.. బలిదానాలు చూడలేకే తెలంగాణ ఇచ్చారని రేవంత్ పేర్కొన్నారు. కల్వకుంట్ల కుటుంబాన్ని అండమాన్ వరకు తరమాలని రేవంత్ అన్నారు. భట్టి మార్చ్ యాత్రలో దృష్టి కొచ్చిన అంశాలు మేనిఫెస్టో గా ఉంటాయని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
Also Read: Telangana Jana Garjana: కాంగ్రెస్ వస్తే వృద్ధులు, వితంతువులకు రూ.4వేల పింఛన్: రాహుల్
తెలంగాణ ఉద్యమానికి పునాది వేసింది ఖమ్మం జిల్లానేనని రేవంత్ తెలిపారు. కేసీఆర్ నుంచి విముక్తితి ఖమ్మం నుంచి శ్రీకారం చుడతామన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా కాంగ్రెస్ సభగా భారీగా తరలివచ్చారన్నారు. అధికారంలోకి వస్తే సంక్షేమం, అభివృద్ధి అనే రెండు పాదాలపై రాష్ట్రాన్ని నడిపిస్తామన్నారు. పొంగులేటి చేరిక ఖమ్మంలో పదికి పది సీట్లలో గెలిపిస్తుందన్నారు.