Telangana: తెలంగాణలో పంపకాలు షూరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పోలింగ్ కు మరో ఐదు రోజులే సమయం ఉండటంతో.. ఓట్ల కోసం నోట్ల పంపిణీ స్టార్ట్ అయింది. తెలంగాణ వ్యాప్తంగా పలు చోట్ల పొలిటికల్ పార్టీలు ప్రలోభాలకు తెరతీశాయి. ఇక, ఖమ్మం జిల్లాలో హోరాహోరీగా పోరు జరుగుతున్న పాలేరు, ఖమ్మం నియోజకవర్గాల్లో ఒక ప్రధాన పార్టీ అభ్యర్థులు నగదు పంపిణీ చేస్తున్నట్లు సమాచారం. ఒక నియోజకవర్గంలో అయితే రాత్రికిరాత్రే పంపకాలు పూర్తైనట్లు తెలుస్తుంది. ఇక, ఆ రెండు నియోజకవర్గాల్లో ఒక చోట ఓటుకు రూ.3 వేలు ఇస్తే, మరోచోట రూ.2 వేల చొప్పున పంచారట. ఇటు హైదరాబాద్‌లోనూ కొన్ని నియోజకవర్గాల్లో డబ్బుల పంపకాలు ప్రారంభమయ్యాయి. శేరిలింగంపల్లిలో ఓ పార్టీ నేత ఓటుకు రూ.3వేల చొప్పున పంపిణీ చేస్తున్నారు. అటు వరంగల్ జిల్లాలోనూ భూపాలపల్లి, మహబూబాబాద్, పాలకుర్తి, వర్దన్నపేట నియోజకవర్గాల్లో ఓటుకు రూ.1000 నుంచి రూ.2 వేల దాకా డబ్బులు ఇస్తున్నారు.
Read Also: Vande Bharat: వందేభారత్ పై మరోసారి రాళ్ల దాడి..
Also Read
- BYD Denza India Launch: భారత్‌లోకి మరో లగ్జరీ కార్ బ్రాండ్.. లగ్జరీ కార్ల మార్కెట్లో కొత్త సంచలనం..
- Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే 'రాగి మునగాకు రొట్టె' చేసేయండి ఇలా.!
- India Sovereign Cloud: ఆధార్.. యూపీఐ.. డిజిలాకర్.. కీలక డేటా కోసం కేంద్రం భారీ సెక్యూరిటీ ప్లాన్.. ఇదే ‘సావరెన్ క్లౌడ్’!
- Ganesh Chaturthi: మనవడితో కలిసి ప్రత్యేక పూజలు.. వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు..
ఇక, గ్రామీణ ప్రాంతాల్లో డబ్బుల పంపకాలు స్టార్ట్ అయినట్లు తెలుస్తుంది. అధికారులు ఒకవైపు తనిఖీలు చేస్తున్నప్పటికి.. మరోవైపు డబ్బును ఒకే చోట నిల్వ చేయడం సురక్షితం కాదని ఎమ్మెల్యే అభ్యర్థులు అనుకుంటున్నారు.. డబ్బు పంపకాల వ్యవహారాన్ని చివరి రోజు రాత్రి వరకూ పెట్టుకుని టెన్షన్ పడడం కంటే ముందుగానే పంచేస్తే మంచిదనే అభిప్రాయంతో చాలామంది పంపకాలు చేస్తున్నారు. అయితే, డబ్బు పంపిణీలో ఒక్కో పార్టీది ఒక్కో విధానం అవలంభిస్తున్నారు. ఇప్పటికే, బీఆర్‌ఎస్ పార్టీ తన అభ్యర్థులకు భారీగానే ఫండింగ్ చేసింది. ఒక విడత నిధులను అభ్యర్థులకు ఇచ్చేసింది. ఇప్పుడు మిగతా నిధుల సర్దుబాటు కార్యక్రమం కూడా బీఆర్ఎస్ పార్టీ చక్కబెట్టేస్తున్నట్టు టాక్.
Read Also: America Gunfire: అమెరికాలో దారుణం.. పీహెచ్ డీ చేస్తున్న 26 ఏళ్ల భారతీయ విద్యార్థి హత్య
అయితే, కాంగ్రెస్ అభ్యర్థులకు ఇప్పటి వరకు పై నుంచి నిధులు వచ్చింది తక్కువే.. ప్రస్తుతానికి ఆ పార్టీ అభ్యర్థులు తమ సొంత డబ్బునే ఖర్చు పెట్టుకుంటున్నారు. ఆ పార్టీ సగానికి పైగా నియోజకవర్గాల్లో ఆర్థికంగా బలంగా ఉన్న అభ్యర్థులకే టికెట్లు ఇచ్చింది. మిగతా నియోజకవర్గాలకు పార్టీ నుంచి ఫండింగ్ వెళ్తుంది. కర్ణాటక నుంచి కొంత, పార్టీలోనే ఆర్థికంగా బలమైన నేతల నుంచి కొంత మేర నిధులను సర్దుబాటు చేస్తున్నారు. మరో వైపు, ఖర్చు విషయంలో వెనుకంజలో ఉండే కమలం పార్టీ.. ఈసారి కొన్ని ఎంపిక చేసిన స్థానాల్లో భారీగా ఖర్చు చేసేందుకు రెడీ అయింది. ఆ పార్టీ బలంగా ఉన్న చోట్ల నిధులను సర్దుబాటు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
Read Also: Top Headlines @ 9 AM : టాప్ న్యూస్
కాగా, అత్యధిక స్థానాల్లో ఓటర్లకు పంచాల్సిన డబ్బును క్షేత్రస్థాయికి తీసుకెళ్లేందుకు అభ్యర్థులు కసరత్తు చేసే పనిలో ఉన్నారు. కొందరు ఇప్పటికే గ్రామాల వరకు డబ్బును తీసుకెళ్లి పార్టీ నేతలకు అందజేస్తున్నారు.. మిగతా వారు పంపిణీకి అవసరమైన డబ్బు కోసం ఇంకా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. పంపిణీ స్టార్ట్ చేయని మిగతా జిల్లాల్లోనూ రెండు.. మూడు రోజుల్లోనే ఆరంభించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. కాలనీలు, అపార్ట్‌మెంట్లు, గ్రామాల్లో, వార్డులు, బస్తీల్లో ఇలా వేర్వేరు ప్రాంతాల్లో డబ్బు పంపిణీకి అన్ని పార్టీలు రెడీ అవుతున్నాయి. డబ్బు పంపిణీలో అభ్యర్థుల విజయావకాశాలు, ప్రతికూల పరిస్థితులను దృష్టిలో పెట్టుకుంటున్నాయి. మూడు ప్రధాన పార్టీలూ సర్వేల ఆధారంగా తాము బలహీనంగా ఉన్న చోట్లే పంపకాలు చేపట్టేందుకు రెడీ అయినట్లు తెలుస్తుంది.
తాజావార్తలు
-
Ketika Sharma : హిట్ వచ్చింది కానీ ఆఫర్స్ మాత్రం రావడం లేదు
-
Parag Shah Turns Beggar: రూ.3,400 కోట్ల ఆస్తులున్న ఎమ్మెల్యే.. ఒక్కరోజు బిచ్చగాడిగా.. వైరల్‌గా మారిన ఘటన
-
BYD Denza India Launch: భారత్‌లోకి మరో లగ్జరీ కార్ బ్రాండ్.. లగ్జరీ కార్ల మార్కెట్లో కొత్త సంచలనం..
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
India Sovereign Cloud: ఆధార్.. యూపీఐ.. డిజిలాకర్.. కీలక డేటా కోసం కేంద్రం భారీ సెక్యూరిటీ ప్లాన్.. ఇదే ‘సావరెన్ క్లౌడ్’!
ట్రెండింగ్
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!