కేంద్ర ప్రభుత్వం రైతులను వేధిస్తుంది: కొప్పుల ఈశ్వర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యాసంగి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు తెలంగాణపై కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నదని మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మల్లాపూర్‌లో టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమానికి మంత్రి ఈశ్వర్ హాజరయ్యారు. కరీంనగర్- రాయపట్నం రహదారిపై మంత్రి బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం మెయిన్ రోడ్డు నుంచి మల్లాపూర్ దాకా జరిగిన రైతుల ర్యాలీలో పాల్గొని మాట్లాడారు. తెలంగాణలో యాసంగి దొడ్డు ధాన్యం కొనుగోలు విషయంలో స్పష్టత ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం రైతులను వేధిస్తున్నదని దుయ్యబట్టారు.
గత ఆరేండ్లుగా సవ్యంగా దొడ్డు వడ్ల కొనుగోళ్లు జరుగ్గా, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయమని చేతులెత్తేయడం సరికాదని విమర్శించారు. యాసంగి ధాన్యం కొనుగోలుపై కేంద్రం తేల్చేదేకా రైతుల పక్షాన పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం దొడ్డు వడ్లు కొనమని ఓ వైపు స్పష్టం చేస్తుంటే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఇతర నాయకులు యాసంగిలో వరి సాగు చేయాలని పక్కదారి పట్టించేలా మాట్లాడుతున్న మాటలను రైతులు నమ్మొద్దని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు విషయంలో స్పష్టతతో వ్యవహరించాలన్నారు.
Also Read
Read Also:
తాజావార్తలు
-
IND vs SL: జడేజా ఖాతాలో చెత్త రికార్డు.. అందులో నంబర్ వన్!
-
Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్ల లాటరీకి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే.?
-
NBK111: స్పీడ్ పెంచిన బాలయ్య .. శుక్రవారం డబ్బింగ్, అక్టోబర్ 5న కొత్త షెడ్యూల్!
-
Russia: రష్యాలో గ్యాస్ కెమికల్ కాంప్లెక్స్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
-
Healthy Lifestyle: ఎక్కువ కాలం ఆరోగ్యంగా బతకాలని ఉందా.. ఈ టైమ్‌లోనే బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్ చేయండి!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..