1.కరోనా కేసులు రోజురోజుకు దేశంలో పెరిగిపోతున్నాయి. మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రభావం భారత్‌లో కనిపిస్తోంది. అనుకున్నదానికంటే శరవేగంగా ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కరోనా కేసులు భారీగా నమోదువుతున్నాయి. గత 10 రోజుల క్రితం దేశవ్యాప్తంగా 50 వేల లోపు నమోదైన కరోనా కేసులు కేసులు ఇప్పుడు లక్ష 50 వేలకు పైగా నమోదవుతున్నాయి. 2.దేశంలో కరోనా కేసుల తీవ్ర భయం…
ఆత్మకూరులో రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వంపై బీజేపీ నేత విష్ణువర్ధన్‌రెడ్డి విమర్శలు చేశారు. ఏపీలో శాంతిభద్రతలు ఎలా ఉన్నాయో సీఎం జగన్ ఆత్మకూరు వచ్చి చూడాలని బీజేపీ నేత విష్ణువర్ధన్‌రెడ్డి హితవు పలికారు. ఆత్మకూరులో పోలీసులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయారని.. ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి.. డిప్యూటీ సిఎం అంజాద్ బాషా, ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్‌లను పక్కన కూర్చోబెట్టుకుని పోలీసులపై బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. అసలు ఆత్మకూరుకు, అంజాద్ బాషాకు…
కుప్పం పర్యటనలో చంద్రబాబు చెప్పినవన్నీ అవాస్తవాలని, చంద్రబాబు ఎన్ని కుప్పి గంతులు వేసినా ప్రజలు నమ్మరని మంత్రి సీదిరి అప్పల రాజు అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. చంద్రబాబు రైతుల గురించి మాట్లాడితే అన్యాయంగా ఉంటుందన్నారు. రైతులను రాజులుగా చేస్తామని చెప్పి అధికారం చేపట్టిన ప్రభుత్వం మాదని మంత్రి అన్నారు. విత్తనం నుంచి విక్రయం వరకు అన్ని దశల్లో రైతులకు చేయూత అందించి ఆత్మ స్థైర్యం కల్పించిన ప్రభుత్వం…
1.దేశంలోకి థర్డ్ వేవ్ ఎంటర్ అయిందని చెప్పడానికి పెరుగుతున్న కేసులే ఉదాహరణగా చెప్పవచ్చు. జనవరి చివరి వారంలో లేదా ఫిబ్రవరి మొదటి వారంలో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. అయితే, ముంబై, ఢిల్లీ వంటి మహానగరాల్లో ప్రతిరోజూ కేసులు పీక్స్‌లో నమోదవుతున్నాయని, జనవరి మిడిల్ వరకు 30 వేల నుంచి 60 వేల మధ్యలో కేసులు నమోదయ్యే అవకాశం ఉందని ఐఐటి కాన్పూర్ శాస్త్రవేత్త మహీంద్రా అగర్వాల్ పేర్కొన్నారు. 2.ఢిల్లీలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి.…
ఉద్యోగ బదీలీలపై కాంగ్రెస్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పందించారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అధికారటీఆర్ఎస్, బీజేపీ పై మండిపడ్డారు. జీఓ 317తో స్థానికత అనేదానికి న్యాయం లేకుండా పోయిందన్నారు. స్థానికత కోసం తెచ్చుకున్న తెలంగాణలో నేడు గందరగోళం సృష్టించారన్నారు. స్థానికత పై రాష్ట్రం పంపిన నివేదికను కేంద్ర ప్రభుత్వం ఎందుకు సమీక్ష కోరలేదని ప్రశ్నించారు. కేంద్రం రాష్ట్రపతికి పంపి ఆమోదం వేయించింది మీరు అంటూ బీజేపీ పై విరుచుకుపడ్డారు. ఇప్పుడు బండి…
1.ఈ ఏడాది ప్రధమార్థంలో ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నది. మార్చితో గోవా, పంజాబ్, మణిపూర్ రాష్ట్రాలకు పాలనా కాలం ముగియనుండగా, మే నెలతో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రభుత్వాల పాలనా కాలం ముగియనున్నది. కరోనా తీవ్రత కారణంగా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల సంఘం అధికారులు ఆయా రాష్ట్రాల్లో పర్యటించారు. అక్కడి పరిస్థితులను సమీక్షించారు. కరోనా కేసులు పెరుగుతున్నందున ఆరోగ్యశాఖ అధికారులతోనూ సంప్రదింపులు జరిపారు. కరోనా కేసులు పెరుగుతున్నందున కొత్త నిబంధనలు తీసుకొస్తున్నట్టు సీఈసీ పేర్కొంది. 2.ఐదు…
పంజాబ్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీకి రైతుల నుంచి పెద్ద ఎత్తున నిరసన సెగలు తాకాయి. రైతులు అడ్డుకోవడంతో ఆయన ఫిరోజ్ పూర్ జిల్లాలో ఓ ఫ్లైఓవర్ పై 20 నిమిషాల పాటు నిర్భంధంలో ఉండాల్సి వచ్చింది. ఇది భద్రతా వైఫల్యం అంటూ కేంద్రం పేర్కొంది. కాంగ్రెస్ పాలిత పంజాబ్ సర్కారే దీనికి బాధ్యత వహించాలని అంటోంది. దీనిపై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలు అర్పించారు. హత్యకు…
ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో పరామర్శించారు. ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకున్నారు. తమ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా వైయస్ షర్మిల మీడియాతో మాట్లాడుతూ.. అధికారపార్టీ పై నిప్పులు చెరిగారు.కేసీఆర్‌కు చేతనైందల్లా గలీజు తిట్లు.. గారడీ మాటలేనన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న ఏడున్నరేళ్లలో 8 వేల మంది ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపించారు. బంగారు తెలంగాణ అన్న కేసీఆర్ బతికే అవకాశం లేకుండా చేస్తున్నారని షర్మిల అన్నారు.…
1.చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు రెండో రోజు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుప్పం నుంచే పోటీ చేస్తానని, మళ్లీ సీఎం అవుతానని ఆయన అన్నారు. అంతేకాకుండా స్థానిక నేతలు మారకపోతే వాళ్లనే మార్చేద్దాం అంటూ ఆయన వ్యాఖ్యానించారు. వైకాపా అధికారంలోకి వచ్చాక ఎన్నికలు ప్రహసనంలా మారాయని ఆయన అన్నారు. మద్యం తయారీలో రసాయనాలు కలుపుతున్నారని ఆయన ఆరోపించారు. 2.తెలంగాణలో ఎంతో ప్రతిష్టాత్మకంగా సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారు.…
దీక్షకు దిగిన సంజయ్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేయడం.. ఆ తర్వాత జేపీ నడ్డా రావడం .. బండి విడుదల అన్ని చకచక జరిగిపోయాయి. ఇప్పుడు తెలంగాణలో రాజకీయం బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్గా మారింది. గత కొన్ని రోజులుగా ఇదే విషయంపై రెండు పార్టీలు ఒకరిపై ఒకరూ ఆరోపణలు, ప్రత్యాఆరోపణలు చేసుకుంటూ తెలంగాణ రాజకీయాన్ని రణరంగంగా మార్చేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ స్వాగత సభ అనంతరం బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ తరుణ్ చుగ్…