ఐపీఎస్ అధికారులు ఖాకీ దుస్తులు వదిలి పింక్ బట్టలు వేసుకున్నారని, పింక్ దుస్తుల్లో గుండాగిరి చేస్తున్నారని, బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ తరుణ్ చుగ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం, అధికారులపై ఫైర్ అయ్యారు. బండి సంజయ్ అరెస్టు సందర్భంగా అనుచితంగా వ్యవహరించిన ఆ అధికారిపై సభా హక్కుల ఉల్లంఘన కేసు ఉందన్నారు. తెలంగాణలో కుటుంబ పాలన నడుస్తుందని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఆందోళనలో పాల్గొన్న వాళ్లు ఈ రోజు మాతో ఉన్నారు.…
1.బీజేపీ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మంత్రి కేటీఆర్. జేపీ నడ్డా అంటే పెద్ద మనిషి అనుకున్నాం. బండి సంజయ్ కు …జేపీ నడ్డాకు పెద్ద తేడా లేదు. బీజేపీ అంటే భకవస్ జుమ్లా పార్టీ. యూపీలో బీజేపీ సర్కార్ చేసింది ఏమి లేదు…అంతా చిల్లర రాజకీయం. దేశంలో చిచ్చు పెట్టి నాలుగు ఓట్లు వేయించుకోవాలని బిజెపి ఆలోచనగా వుంది. ఎన్డీఏ ప్రభుత్వంలో భాగ్యస్వామ్య పక్షాలు ఎవరు అంటే బీజేపీ, ఈడీ,సీబీఐ, ఐటీలే అన్నారు. ఢిల్లీలో కొంత మీడియా…
టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ఉ ఓటేసి ప్రజలు తప్పు చేశారన్నారు. ప్రజలకు జగన్ చరిత్ర తెలిసి మరీ ఓటేశారని ఫైర్ అయ్యారు. జైల్లో ఉండి వచ్చిన వ్యక్తికి ప్రజలు ఓట్లేయడమంటే ప్రజలు చేసిన తప్పు కాక మరేమిటీ.. ? అంటూ సీరియస్ అయ్యారు. చంద్రబాబుకంటే ఎక్కువగా ఏదో మంచి చేస్తారని ప్రజలు ఓట్లేశారని.. ఇచ్చిన హామీలన్నీ చేసేస్తాడేమో.. మనం ఏమైపోతాం అని.. రాజకీయంగా ఉండగలమా..? లేదా..? అని నేనూ భయపడ్డానని వెల్లడించారు.…
ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాశ్‌రావు టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలపై కీలక వ్యాఖ్యలు చేశారు. రామగుండంలోని పరిశ్రమల్లో ఉద్యోగాల కల్పిస్తామంటూ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పేర్లు చెప్పుకుని కొందరు వసూళ్లకు పాల్పడుతున్నారని గోనెప్రకాశ్‌రావు ఆరోపించారు. నేను దళిత వ్యతిరేకిని కాదన్నారు. ప్రజాప్రతినిధుల మాఫీయా వ్యవహారాలపై ప్రజా వేదిక ఏర్పాటు చేద్దామంటూ సవాల్ విసిరారు. Read Also:ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నూతన విద్య ప్రణాళిక పై చర్చ నేను నోరు…
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారింది. దీంతో నేడు బీజేపీ శ్రేణులు ర్యాలీకి పిలుపునిచ్చారు. ఈ ర్యాలీలో పాల్గొనడానికి ఢిల్లీ నుంచి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. అయితే జేపీ నడ్డాను అడ్డుకునేందుకు అప్పటికే ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న పోలీసులు తెలంగాణలోని కోవిడ్ నిబంధనల గురించి వివరించారు. దీంతో ఆయన కోవిడ్ నిబంధనల ప్రకారమే నిరసన తెలియజేస్తానన్నారు. దీంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్…
1.ఏపీ ప్రభుత్వం గతంలో జీవో నెంబర్ 2ను ప్రవేశపెట్టింది. పంచాయతీ సర్పంచులు, సెక్రటరీల అధికారాలను వీఆర్వోలకు అప్పగిస్తూ ఈ జీవోను ఏపీ ప్రభుత్వం జారీ చేసింది. అయితే ప్రభుత్వం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సర్పంచులు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. జీవో నెంబర్ 2 పంచాయతీ రాజ్ చట్టానికి విరుద్ధమని పిటిషనర్లు పేర్కొన్నారు. దీంతో సర్పంచుల పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు గతంలోనే జీవో నెంబర్ 2ను సస్పెండ్ చేసింది. 2.మహారాష్ట్రలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. కేసులు…
ఏపీ ప్రభుత్వంపై మాజీ సీఎం చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. మంగళగిరిలో పార్టీ నేతలతో సమావేశం ముగిసిన తర్వాత ఆయన మాట్లాడుతూ… వైసీపీకి ప్రజలు నమ్మకంతో ఓటేస్తే.. జగన్ ఆ నమ్మకాన్ని ఒమ్ము చేశారని ఆరోపించారు. మద్య నిషేధం చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. న్యూఇయర్ రోజు ఒక్కరోజే రూ.124 కోట్ల అమ్మకాలు చేశారంటే మద్య నిషేధం ఎలా చేస్తారని ప్రజలను నమ్మమంటారని నిలదీశారు. సొంత మద్యం బ్రాండ్లతో అంతా దోచుకుని ఇప్పుడు…
త్వరలో యూపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే ఆ రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు మాటల యుద్ధానికి తెరలేపాయి. తాజాగా సమాజ్‌వాదీ పార్టీ నేత, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యూపీలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రామరాజ్యాన్ని స్థాపిస్థానని శ్రీకృష్ణుడు ప్రతిరోజూ తన కలలోకి వచ్చి చెప్తున్నాడని అఖిలేష్ వ్యాఖ్యానించారు. రామరాజ్యానికి సామ్యవాదమే మార్గమని… సమాజ్‌వాదీ పార్టీ అధికారంలోకి వచ్చినరోజు రాష్ట్రంలో రామరాజ్యం ఏర్పడుతుందని…
ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ మళ్లీ ఘనవిజయం సాధిస్తుందని… జగన్ మళ్లీ సీఎం అవుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఒకవేళ జగన్ మళ్లీ సీఎం కాకపోతే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ధర్మాన స్పష్టం చేశారు. శ్రీకాకుళంలో డ్వాక్రా బజార్ ప్రారంభోత్సవం సందర్భంగా మాట్లాడుతూ… వైసీపీలో విభేదాలు రచ్చకెక్కాయంటూ టీడీపీ నేతలు ప్రచారం చేస్తుండటంపై మండిపడ్డారు. టీడీపీ నేతలు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ధర్మాన ఆగ్రహం…
రాష్ట్రంలో దశ దిశ లేని జగన్‌రెడ్డి పాలన సాగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. రాజధాని కడతామని చంద్రబాబు ఓడిపోయాడు.. ముఖ్యమంత్రి జగన్ వైజాగ్ పారిపోయాడు.. 2024లో బీజేపీకి అధికారాన్ని ఇస్తే రూ.10వేల కోట్లతో మూడేళ్లలో అమరావతి రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేస్తామని సోము వీర్రాజు అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గత ఎన్నికల్లో ఒక్కశాతం ఓట్లు ఇచ్చినా ప్రధాని మోడీ ఏపీకి రూ.50 వేల కోట్లను ఇచ్చారని చెప్పారు. Read Also:…