ఆత్మకూరులో రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వంపై బీజేపీ నేత విష్ణువర్ధన్‌రెడ్డి విమర్శలు చేశారు. ఏపీలో శాంతిభద్రతలు ఎలా ఉన్నాయో సీఎం జగన్ ఆత్మకూరు వచ్చి చూడాలని బీజేపీ నేత విష్ణువర్ధన్‌రెడ్డి హితవు పలికారు. ఆత్మకూరులో పోలీసులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయారని.. ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి.. డిప్యూటీ సిఎం అంజాద్ బాషా, ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్‌లను పక్కన కూర్చోబెట్టుకుని పోలీసులపై బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. అసలు ఆత్మకూరుకు, అంజాద్ బాషాకు ఏం సంబంధముందని ప్రశ్నించారు.
Read Also: కరోనాపై తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తం కావాలి: పవన్ కళ్యాణ్
బీజేపీ నేతలపై దాడి చేసిన వాళ్లలో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారని.. వారి పేర్లను కేసుల నుంచి తొలగించాలని ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి పోలీసులపై ఒత్తిడి తెస్తున్నారని బీజేపీ నేత విష్ణువర్ధన్‌రెడ్డి విమర్శించారు. వైసీపీ ప్రభుత్వానికి దమ్ముంటే… వైసీపీ నేతలు అంజాద్ బాషా, శిల్పా చక్రపాణిరెడ్డి, హఫీజ్ ఖాన్‌లపై వెంటనే కేసులు నమోదు చేయాలని బీజేపీ నేత విష్ణువర్ధన్‌రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో భయానక వాతావరణాన్ని సృష్టించిన వారిపై తీవ్రమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ కర్నూలు జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులుకు వినతిపత్రం ఇచ్చామని తెలిపారు.
ఒక భయానక వాతావరణాన్ని సృష్టించిన వారిపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ @BJP4Andhra ఆధ్వర్యంలో కర్నూలు జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు గారికి వినతిపత్రం ఇవ్వడమైనది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రామస్వామి గారు , రాష్ట్ర ఉపాధ్యక్షుడు చంద్రమౌళి గారు,(2/3), pic.twitter.com/q58dQChuCD
— Vishnu Vardhan Reddy (@SVishnuReddy) January 10, 2022