పంజాబ్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీకి రైతుల నుంచి పెద్ద ఎత్తున నిరసన సెగలు తాకాయి. రైతులు అడ్డుకోవడంతో ఆయన ఫిరోజ్ పూర్ జిల్లాలో ఓ ఫ్లైఓవర్ పై 20 నిమిషాల పాటు నిర్భంధంలో ఉండాల్సి వచ్చింది. ఇది భద్రతా వైఫల్యం అంటూ కేంద్రం పేర్కొంది. కాంగ్రెస్ పాలిత పంజాబ్ సర్కారే దీనికి బాధ్యత వహించాలని అంటోంది. దీనిపై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలు అర్పించారు. హత్యకు…
ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో పరామర్శించారు. ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకున్నారు. తమ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా వైయస్ షర్మిల మీడియాతో మాట్లాడుతూ.. అధికారపార్టీ పై నిప్పులు చెరిగారు.కేసీఆర్‌కు చేతనైందల్లా గలీజు తిట్లు.. గారడీ మాటలేనన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న ఏడున్నరేళ్లలో 8 వేల మంది ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపించారు. బంగారు తెలంగాణ అన్న కేసీఆర్ బతికే అవకాశం లేకుండా చేస్తున్నారని షర్మిల అన్నారు.…
1.చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు రెండో రోజు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుప్పం నుంచే పోటీ చేస్తానని, మళ్లీ సీఎం అవుతానని ఆయన అన్నారు. అంతేకాకుండా స్థానిక నేతలు మారకపోతే వాళ్లనే మార్చేద్దాం అంటూ ఆయన వ్యాఖ్యానించారు. వైకాపా అధికారంలోకి వచ్చాక ఎన్నికలు ప్రహసనంలా మారాయని ఆయన అన్నారు. మద్యం తయారీలో రసాయనాలు కలుపుతున్నారని ఆయన ఆరోపించారు. 2.తెలంగాణలో ఎంతో ప్రతిష్టాత్మకంగా సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారు.…
దీక్షకు దిగిన సంజయ్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేయడం.. ఆ తర్వాత జేపీ నడ్డా రావడం .. బండి విడుదల అన్ని చకచక జరిగిపోయాయి. ఇప్పుడు తెలంగాణలో రాజకీయం బీజేపీ వర్సెస్ టీఆర్‌ఎస్‌గా మారింది. గత కొన్ని రోజులుగా ఇదే విషయంపై రెండు పార్టీలు ఒకరిపై ఒకరూ ఆరోపణలు, ప్రత్యాఆరోపణలు చేసుకుంటూ తెలంగాణ రాజకీయాన్ని రణరంగంగా మార్చేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ స్వాగత సభ అనంతరం బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ తరుణ్ చుగ్…
ఏపీలో వైసీపీ గుర్తుతో గెలిచినా.. నిత్యం సొంత పార్టీపైనే విమర్శలు చేస్తూ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు వార్తల్లో నిలుస్తున్నారు. దీంతో ఎంపీ రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు వేయాలని వైసీపీ ఎంపీలు డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే ఈ అంశంపై లోక్‌సభ ఎంపీ ఓంబిర్లాను కూడా వైసీపీ ఎంపీలు కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ నేపథ్యంలో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై అనర్హత వేటు వేయాలని వైసీపీ ఎంపీలు ప్రయత్నిస్తున్నారని… అయినా వారి…
కరీంనగర్ నుంచి హైదరాబాద్ కు వెళ్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సిద్ధిపేటలోని రంగదాంపల్లి వద్ద కార్యకర్తలను కలిసి వారితో ముచ్చటించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. రాష్ట్రముఖ్యమంత్రి నేతృత్వంలో పోలీసులు దాడి చేసిన తీరును దేశం మొత్తం చూసిందన్నారు. నీకు వత్తాసు పలికితే కేసులు లేవు.. లేదంటే కేసులు పెట్టి బెదిరిస్తావా అంటూ ఫైర్ అయ్యారు. రాష్ర్టంలో రాక్షస పాలన నడుస్తుందన్నారు. నా కార్యాలయంలో దాడులు…
ఏపీ పౌరసరఫరాల మంత్రి కొడాలి నాని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా ఆయన టీడీపీ పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.దున్నపోతు ఈనింది అంటే దూడను కట్టేయండి అన్నట్లు టీడీపీ తీరు ఉందని విమర్శించారు. Read Also:జగ్గారెడ్డి కీలక నిర్ణయం.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా . హెరిటేజ్ లో రేట్ల కన్నా మార్కెట్ రేట్ తక్కువగా ఉందన్నారు. హెరిటేజ్‌లో ఆశీర్వాద్ గోధుమ పిండి కేజీ. రూ.59 ఉంటే మార్కెట్ రేటు 52 రూపాయలు ఉందన్నారు. అలాగే…
గత కొన్ని రోజులుగా కాంగ్రెస్‌లో జగ్గారెడ్డి పాత్ర హట్ టాపిక్‌గా మారింది. ఐదురోజుల్లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తామని జగ్గారెడ్డి ప్రకటించారు. దీంతో కొందరూ సీనియర్ నేతలు ఆయనను బుజ్జగిస్తున్నారు. నిన్న పీఏసీ సమావేశంలో వాడివేడిగా సాగిన చర్చ. అయితే ఈ చర్చలో పరోక్షంగా జగ్గారెడ్డి అంశంపైనే ఎక్కువ చర్చ జరిగినట్టు సమాచారం. దీంతో జగ్గారెడ్డి మనస్తాపానికి గురయ్యారు. సంగారెడ్డిలో కాంగ్రెస్ సత్తా ఏంటో తేల్చుకోవాలని నేరుగా కాంగ్రెస్ రాష్ర్ట వ్యవహారాల ఇన్చార్జ్ మానిక్కమ్ ఠాగుర్కు సవాల్…
తన అరెస్టుపై బండి సంజయ్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..అధికార పార్టీపై విమర్శలు గుప్పించారు.ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగిన దారుణ మారుణ కాండపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుందని బండి సంజయ్ అన్నారు.ఈ ఘటనను గురించి తెలసుకునేందుకు ఛత్తీస్‌ఘడ్ మాజీ సీఎం రమణ్‌సింగ్ ఇక్కడకు వచ్చారన్నారు. డాక్టర్ కె.లక్ష్మణ్ ను రాత్రి 9 గంటలకు అరెస్టు చేసి తెల్లవార్లు చలిలో ఉంచడం ప్రభుత్వ మూర్ఖత్వానికి పరాకాష్ట అని బండి సంజయ్ అన్నారు. తెలంగాణలో రాక్షస,…
బంగారు తెలంగాణలో రక్షకులు భక్షకులుగా మారారని బీజేపీ తెలంగాణ ఇన్చార్జ్ తరుణ్ చుగ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జైలులో ఉన్న మా నేత ఉన్న మా కార్యకర్తలు,నాయకులు ధైర్యంగా ఉన్నారన్నారు. ప్రజల ఉద్యోగుల సమస్యలపై పోరాడుతున్న బండిసంజయ్ పై ఇతర నేతలపై దాడి చేచసి కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. పోలీసులు ఖాకీలు గులాబీ కండువా కప్పుకుని కేసీఆర్ చేతిలో బార్బీ బొమ్మలుగా మారారని విమర్శించారు. దీక్షలో పాల్గొన్న మహిళలను కించపర్చారు. బట్టలు జారుతున్న…