చంద్రబాబు ఎన్ని కుప్పిగంతులు వేసినా ప్రజలు నమ్మరు: అప్పల రాజు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కుప్పం పర్యటనలో చంద్రబాబు చెప్పినవన్నీ అవాస్తవాలని, చంద్రబాబు ఎన్ని కుప్పి గంతులు వేసినా ప్రజలు నమ్మరని మంత్రి సీదిరి అప్పల రాజు అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. చంద్రబాబు రైతుల గురించి మాట్లాడితే అన్యాయంగా ఉంటుందన్నారు. రైతులను రాజులుగా చేస్తామని చెప్పి అధికారం చేపట్టిన ప్రభుత్వం మాదని మంత్రి అన్నారు. విత్తనం నుంచి విక్రయం వరకు అన్ని దశల్లో రైతులకు చేయూత అందించి ఆత్మ స్థైర్యం కల్పించిన ప్రభుత్వం మాదేనని మంత్రి పేర్కొన్నారు. రైతు భరోసా కేంద్రం దేశం మొత్తం అమలు చేయాలని నీతి ఆయోగ్ చెప్పిందన్నారు. వ్యవసాయ మరియు వ్యవసాయ ఆధారిత రంగాల్లో ఏపీ మొదటి స్థానంలో ఉందని కేంద్ర ప్రభుత్వం చెప్పిందన్నారు. ఏపీకి జగన్ శాశ్వత ముఖ్యమంత్రి , చంద్రబాబు ఇది రాసి పెట్టుకోవాలని మంత్రి అన్నారు. సచివాలయాల ఏర్పాటుతో లక్షా 50 వేల ఉద్యోగాలు ఇచ్చాం. అన్ని రంగాల్లో ఉన్న ఖాళీలను కూడ భర్తీ చేస్తున్నామన్నారు. జాబ్ చార్ట్ గురించి మాట్లాడుతున్న చంద్రబాబుకు ఇవన్నీ కనిపించట్లేదా ? అంటూ ఎద్దేవా చేశారు.
Read Also:హోంగార్డ్ వేధింపులు తాళలేక.. వ్యక్తి ఆత్మహత్య యత్నం
Also Read
- Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Liquor Shops: ఏపీలో మద్యం దుకాణాలకు రెండో విడత నోటిఫికేషన్.. అక్టోబర్ 19 దరఖాస్తులకు చివరి తేదీ..
- Thalliki Vandanam: తల్లికి వందనం రెండో దశ నిధులు విడుదల.. రెండో దశలో లబ్ధిదారులు వీరే..
చంద్రబాబుకు, ఉద్యోగులు, రైతులు, సామాన్య ప్రజల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. ప్రభుత్వం చికెన్, చేపలు అమ్ముతోందంటూ చంద్రబాబు విమర్శలు చేస్తున్నారని కానీ దాని ద్వారా వచ్చే ఫలితాలను విస్మరిస్తున్నారన్నారు. వారికి సబ్సీడీ ఇచ్చి ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా చేయాలనే గొప్ప సంకల్పంతో ప్రభుత్వం ఉందన్నారు. చంద్రబాబు లేదా ఇంకెవరో విమర్శలు చేస్తుననారని ఈ యజ్ఞం ఆగదని మంత్రి స్పష్టం చేశారు. సచివాలయ ఉద్యోగులు మాట్లాడేముందు ఆలోచించుకోవాలని సూచించారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఐదేళ్లు అయినా ప్రొబిహిషన్ ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాయని మంత్రి గుర్తు చేశారు. జూన్ నాటికి ప్రొబేషన్ ప్రకటించాలని సీఎం జగన్ స్పష్టంగా చెప్పారన్నారు. ఇందులో వివాదం ఏముందని ప్రశ్నించారు. చంద్రబాబు తొత్తులు అన్ని రంగాల్లో ఉన్నారన్నారు. అలాంటి వారు చేసే వ్యాఖ్యలను పట్టుకుని పెద్ద ఉద్యమంలాగా చిత్రికరించి చూపించాల్సిన అవసరం మాకు లేదని మంత్రి పేర్కొన్నారు. సచివాలయ వ్యవస్థ అనేది జగన్‌కు మానసపుత్రిక లాంటిదని, సచివాలయ వ్యవస్థ జగన్‌కు అపారమైన నమ్మకం ఉందని మంత్రి అప్పలరాజు చెప్పారు.
తాజావార్తలు
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
ట్రెండింగ్
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!