తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ దోపిడీ చేస్తున్నారు: డీకే.అరుణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ దోపిడీ చేస్తున్నారు బీజేపీ నేత డీకే. అరుణ అన్నారు. మంగళవారం మహబూబ్‌నగర్‌లో జరిగిన బీజేపీ నిరసన దీక్షలో ఆమె పాల్గన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… టీఆర్‌ఎస్ పై తీవ్ర విమర్శలు చేశారు. లక్షల కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం నిర్మిస్తే… ఎక్కడా ఒక్క చుక్క నీరు పారలేదని.. కేవలం కేసీఆర్ ఫామ్ హౌజ్ ఉన్న ఎర్రవెల్లికే నీటిని మళ్లించారని ఆరోపించారు. మూడేళ్లలో పాలమూరు రంగారెడ్డి కడతా అని.. 14 లక్షల ఎకరాలకు నీరు అందిస్తానని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు నీ హామీ ఏమైందంటూ డీకే అరుణ ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు రక్తాన్ని దొచుకుని కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భారీగా అవినీతి జరిగిందని డీకే అరుణ అన్నారు.
ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చడం లేదని ఆమె అన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్ల హామీతో ప్రజలను మభ్య పెడుతున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రంలో నియంతలా వ్యవహరిస్తున్న సీఎం కేసీఆర్ చేష్టనలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు ఆమె పిలుపునిచ్చారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, నిరుద్యోగులు రాష్ట్రాన్ని సాధించుకుంటే.. కేవలం ఫలాలను కల్వకుంట్ల కుటుంబం మాత్రమే అనుభవిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ.. బండి సంజయ్ 317 జీవో కు వ్యతిరేఖంగా బండి సంజయ్ జాగరణ దీక్షచేస్తుంటే… డైరెక్ట్ గా సీపీకి సీఎం కేసీఆర్ ఫోన్ చేసి దాడి చేయించేలా చేశారని దుయ్యబట్టారు. తెలంగాణలో అన్ని వర్గాలు కేసీఆర్‌ను గద్దె దింపాలని చూస్తున్నాయన్నారు. త్వరలోనే కేసీఆర్‌కు ప్రజలు బుద్ధి చెబుతారని డీకె అరుణ అన్నారు.
Also Read
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
- Saudi-India: ‘అప్రమత్తంగా ఉండండి.. ఇంట్లోనే ఉండండి’.. సౌదీలోని భారతీయులకు కేంద్రం సూచన
- Mecca Defence Pact: మక్కా ఒప్పందానికి బీటలు! సౌదీకి తేల్చి చెప్పిన టర్కీ!
- Saudi-Houthi: మరింత దూకుడు పెంచిన హౌతీలు.. రియాద్ ఎయిర్పోర్టుపై దాడి!
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!