టీడీపీ ప్రతిపక్షంగా వైఫల్యం చెందిందని ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ పై పలు విమర్శలు చేశారు. చంద్రబాబు ప్రజల విశ్వాసానని కోల్పోయారన్నారు. ఓటీఎస్ పై టీడీపీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని ఆయన తెలిపారు. అధికారంలోకి రాగానే పట్టాలిస్తామంటున్న టీడీపీ నేతలు అధికారంలో ఉండగా కుంభకర్ణుడిలా నిద్రపోయారంటూ ఎద్దేవా చేశారు. Read Also: పచ్చమందకు పైత్యం బాగా ముదిరింది: విజయసాయిరెడ్డి ప్రతిపక్ష నేతలు సంస్కారం లేని మాటలు మాట్లాడుతున్నారని ఆరోపించారు.…
మరోసారి తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. కేసీఆర్ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని, ఈ విషయములో కేంద్రం సీరియస్‌గా ఉందన్నారు. కేసీఆర్‌పై కేంద్ర ప్రభుత్వం చర్యలకు సిద్దమైందని, ఎప్పుడైనా కేసీఆర్ జైలుకి వెళ్ళొచ్చన్నారు. అంతేకాకుండా ఈ విషయం కేసీఆర్ కు తెల్సి పోయిందని, అందుకే కమ్యూనిస్టుల తోను, ఇతర పార్టీల నేతల తో భేటీ అవుతున్నాడని విమర్శించారు. తేజస్వి యాదవ్ తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ కూడా పసుగ్రాసం కుంభకోణం కేసులో జైలుకు వెళ్లి…
జనసేన కార్యనిర్వాహక సభ్యులతో పవన్ కళ్యాణ్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీలో పొత్తులపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అందరితో కలిసి చర్చించాకే వచ్చే ఎన్నికల్లో పొత్తులపై నిర్ణయం తీసుకుంటామని పవన్ స్పష్టం చేశారు. ప్రస్తుతం బీజేపీతో పొత్తులో ఉన్నామన్నారు. రకరకాల పార్టీలు మనతోనే పొత్తు కోరుకోవచ్చని పవన్ అభిప్రాయపడ్డారు. అయితే ప్రస్తుతం పొత్తుల కంటే ముందుగా పార్టీ బలోపేతం, సంస్థాగత నిర్మాణంపైనే కార్యకర్తలు ఫోకస్ పెట్టాలని సూచించారు. పొత్తులపై అందరిదీ ఒకే…
టీడీపీ అధినేత చంద్రబాబు టీడీపీ ఈ-పేపర్‌ను మంగళవారం సాయంత్రం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన సినిమా టిక్కెట్ల వివాదంపై కీలక వ్యాఖ్యలు చేశారు. కొందరు అనవసరంగా సినిమా టిక్కెట్ల వివాదంలోకి టీడీపీని లాగుతున్నారని… టీడీపీకి సినిమా పరిశ్రమ సహకరించిన దాఖలాలు లేవన్నారు. సీఎంగా ఉన్నప్పుడు, ఇటీవల తనకు వ్యతిరేకంగా సినిమాలు తీశారని చంద్రబాబు గుర్తుచేశారు. రాజకీయ పార్టీ పెట్టకముందు… ఆ తర్వాత చిరంజీవి తనతో బాగానే ఉన్నారని… కానీ 2009లో చిరంజీవి తనకు సహకరించి ఉంటే అప్పుడు…
తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి జాతీయ రాజకీయాలపై ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలతో కేసీఆర్ మంతనాలు జరుపుతున్నారు. థర్డ్ ఫ్రంట్ దిశగా కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారు. ఇటీవల తమిళనాడు సీఎం స్టాలిన్, లెఫ్ట్ పార్టీల నేతలతో కేసీఆర్ చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. తాజాగా మంగళవారం మధ్యాహ్నం ప్రగతి భవన్లో ఆర్జేడీ నేత, బీహార్ ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్‌తో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ కుమారుడు…
తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ దోపిడీ చేస్తున్నారు బీజేపీ నేత డీకే. అరుణ అన్నారు. మంగళవారం మహబూబ్‌నగర్‌లో జరిగిన బీజేపీ నిరసన దీక్షలో ఆమె పాల్గన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… టీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు చేశారు. లక్షల కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం నిర్మిస్తే… ఎక్కడా ఒక్క చుక్క నీరు పారలేదని.. కేవలం కేసీఆర్ ఫామ్ హౌజ్ ఉన్న ఎర్రవెల్లికే నీటిని మళ్లించారని ఆరోపించారు. మూడేళ్లలో పాలమూరు రంగారెడ్డి కడతా అని.. 14 లక్షల ఎకరాలకు…
1.ఏపీలో నైట్ కర్ఫ్యూ విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సంక్రాంతి పండగ నేపథ్యంలో నైట్ కర్ఫ్యూ వల్ల ప్రజలు ఇబ్బంది పడే అవకాశముందని సీఎం దృష్టికి వచ్చిందని ఎన్టీవీతో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని వెల్లడించారు. దీంతో రాత్రి కర్ఫ్యూ అమలులో సడలింపు ఇస్తూ నిర్ణయం తీసుకున్నారని… ఈ నెల 18 నుంచి రాత్రి కర్ఫ్యూ అమలులోకి వస్తుందని తెలిపారు. 2.మంత్రి కేటీఆర్‌పై మండిపడ్డారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. కేటీఆర్ ఉత్తర కుమార ప్రగల్భాలు…
కరోనా కష్టకాలంలో దేశప్రజలకు నటుడు సోనూసూద్ ఎన్నో సేవలు అందించాడు. ఒకానొక సమయంలో ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేస్తాడని కూడా ప్రచారం జరిగింది. అయితే ఆయన సోదరి తాజాగా రాజకీయాల్లో అడుగుపెట్టారు. సోనూసూద్ సోదరి మాళవికా సూద్ సోమవారం నాడు పంజాబ్ రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీలో చేరారు. పంజాబ్ సీఎం చరణ్ జిత్ చన్నీ సమక్షంలో ఆమె కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. పంజాబ్‌లో ఫిబ్రవరిలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మోగా నుంచి ఆమె పోటీ చేయనున్నారు.…
చైనాలో తయారైన రామనుజాచార్యుల విగ్రహావిష్కరణకు రావద్దని, అలా వస్తే మీరు దేశద్రోహులే అవుతారని ప్రధాని మోడీని ఉద్దేశించి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మోడీ ఎజెండాను కేసీఆర్ అమలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. బండి సంజయ్, మోడీ దేశభక్తి నేతి బీరకాయలో నేతి అంత అని ఆయన ఎద్దేవా చేశారు. Read Also: పాల్వంచ ఘటన..రామకృష్ణ తల్లి, సోదరి అరెస్టు బీజేపీ నేతలు మేక్ ఇన్ ఇండియా అని గొప్పలు చెబుతారని,…
ఏపీ సర్కారుపై టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ విమర్శలు చేశారు. ఏపీలో సినిమా సమస్యలు తప్ప మరే సమస్యలు ప్రభుత్వానికి కనిపించడంలేదా అని పయ్యావుల కేశవ్ నిలదీశారు. ఏ సమస్య లేదు అన్న తరహాలో సినిమా టిక్కెట్ల ధరల గురించి మంత్రులు చర్చించుకుంటున్నారని మండిపడ్డారు. రైతుల జీవితాల్లో సినిమా కష్టాలకు మించిన కష్టాలు ఉన్నాయన్నారు. వాటి గురించి ప్రభుత్వం ఎందుకు చర్చించడం లేదని సూటిగా ప్రశ్నించారు. Read Also: చట్టప్రకారమే సినిమా టిక్కెట్ ధరలు: మంత్రి పేర్ని…