మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన రైతు దీక్షలో మంత్రి సత్యవతి రాథోడ్ సమక్షంలో వర్గవిభేదాలు బయటపడ్డాయి.. మహబూబాబాద్ టీఆర్ఎస్ పార్టీ జిల్లా ఆధ్యక్షరాలు ఎంపీ మాలోత్ కవిత రైతు దీక్షలో మాట్లాడుతుండగా స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్ మైక్ లాక్కొని మాట్లాడారు. బిత్తరబోయిన కవిత కిందకూర్చోని పక్కన వున్న ఎమ్మెల్సీ తక్కెళ్ల పల్లి రవీందర్ రావుకి చెప్పారు. అంతేకాకుండా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఆధ్యక్షతన అనగానే… పక్కనే ఉన్నా డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్.. వెంటనే స్పందించి. అదికాదు… జిల్లా ఆధ్యక్షురాలు కవిత ఆధ్యక్షతన చెప్పాలని మంత్రి కి సూచించారు.
ఎమ్మెల్యే రెడ్యానాయక్.. వర్గవిభేదాలతో కార్యకర్తలు బిత్తరబోయిరు.. ఇది ఇలా వుంటే రైతు దీక్ష స్థానిక తహసీల్దార్ కార్యాలయం గేటుకి అడ్డంగా పెట్టడంతో ఆధికారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందుల పడ్డారు. రోడ్డు పైన దీక్ష పెట్టడంతో ప్రయాణీకులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడినా కనీసం పోలీసులు ఎవరు కూడ పట్టించుకోకపోవడంతో పలు విమర్శలకు తావిస్తోంది.