SI Anil: జగిత్యాల రూరల్ ఎస్సై అనిల్ కేసు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. అదే సమయంలో అనిల్ సస్పెన్షన్కు వ్యతిరేకంగా విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో జగిత్యాల బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది.
DK Shiva kumar: కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ కు ప్రస్తుతం బ్యాడ్ టైం నడుస్తోంది. వరుస ప్రమాదాలకు గురవుతున్నాడు. నిన్న కాక మొన్న హెలికాఫ్టర్ లో ప్రయాణిస్తుండగా దానిని పక్షి ఢీకొట్టింది. ఆ సమయంలో ఫైలట్ చాకచక్యంగా వ్యవహరించి హెలికాప్టర్ ను ల్యాండ్ చేయడంతో పెను ప్రమాదం తప్పింది.
West Bengal: పశ్చిమ బెంగాల్ లో బీజేపీ నాయకుడి మరణం తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ), బీజేపీ మధ్య మంటలు రేకెత్తించింది. తమ పార్టీ నాయకుడిని తృణమూల్ కాంగ్రెస్ హత్య చేసిందని బీజేపీ ఆరోపించింది. అయితే బీజేపీ చేస్తున్న ఆరోపణల్ని టీఎంసీ తోసిపుచ్చింది. మొయినా బిజెపి బూత్ ప్రెసిడెంట్ బిజయ్కృష్ణ భునియా సోమవారం సాయంత్రం ఇంటికి తిరిగి వస్తుండగా అతని భార్య ముందే టీఎంసీ గుండాలు కొట్టారని, బలవంతంగా బైక్ పై తీసుకెళ్లారని బీజేపీ ఆరోపించింది.
Revanth Reddy: తెలుగుదేశం పార్టీ హయాంలో ఓఆర్ఆర్ ప్రతిపాదన పెడితే.. 2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఓఆర్ఆర్కు పునాది పడిందని టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి అన్నారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని 5 వేల ఎకరాల్లో ఏర్పాటు చేశారన్నారు.
New Secretariat: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కొత్త సచివాలయాన్ని ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఈ నెల 30న సచివాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించిన కార్యక్రమాల షెడ్యూల్ను ప్రభుత్వం విడుదల చేసింది.
ఆదిలాబాద్ జిల్లాలో తెలంగాణ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర కొనసాగుతుంది. రెండవ రోజు ఇచ్చోడ నైట్ హాల్ట్ పాయింట్ నుంచి పీపుల్స్ మార్చ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. మొదటి రోజు పిప్పిరి నుంచి ఇచ్చోడ వరకు యాత్ర కొనసాగింది. నేడు సిరికొండలో సాయంత్రం కార్నర్ మీటింగ్ లో భట్టి మాట్లాడనున్నారు.
విచారణకు సంబంధించి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన విజ్ఞప్తిపై రాష్ట్ర మహిళా కమిషన్ స్పందించింది. ఆయన అభ్యర్థన మేరకు తెలంగాణ మహిళా కమిషన్ విచారణను ఈ నెల 18కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.
నార్సింగిలోని శ్రీ చైతన్య కళాశాల గుర్తింపును తెలంగాణ ఇంటర్ బోర్డు శాశ్వతంగా రద్దు చేసింది. కాలేజీ యాజమాన్యం వేధింపుల వల్లే సాత్విక్ ఆత్మహత్య చేసుకున్నట్లు తేలడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.