కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. తాజాగా.. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు బైజయంత్ జై పాండాతో కలిసి దిగిన సెల్ఫీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకుముందు ప్రధాని మోదీని ప్రశంసించిన వ్యాఖ్యలు, ఈ ఫోటో శశి థరూర్ రాజకీయ భవిష్యత్తును మరింత ఉత్కంఠకరంగా మార్చాయి.
తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీకి భారీ షాక్ తగిలే అవకాశం కనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీని వీడే ఆలోచనలో అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో ఆయన టీడీపీ రెబల్ అభ్యర్థిగా ఈసారి ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచనతో ఉన్నట్లు కనిపిస్తుంది.
వైసీపీ రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తన రాజకీయ ప్రస్తానానికి సంబంధించి ఈరోజు కీలక ప్రకటనన చేసే అవకాశం ఉంది. వైసీపీ అధిష్టానం వ్యవహరిస్తున్న తీరుకు.. తీవ్ర మనస్థాపానికి గురైన వేమిరెడ్డి గత కొద్ది రోజుల నుంచి మౌనంగా ఉంటున్నారు.
తెలంగాణలో భారీ వర్షాలతో ప్రాణ, ఆస్తి నష్టం జరుగుతుంటే కేసీఆర్ మహారాష్ట్ర రాజకీయాల్లో బిజీగా ఉన్నారు అని బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్ అన్నారు. ఇక్కడ ప్రజలు మునిగిపోతుంటే, కేసీఆర్ మహారాష్ట్ర రాజకీయాల్లో మునిగి పోయారు.. ముఖ్యమంత్రి నిద్ర లేస్తేనే యంత్రాంగం లేస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.
ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేవారు.. పోలవరం, ఇతర అంశాలపై ఏపీ సర్కార్‌ను టార్గెట్ చేసి విమర్శలు గుప్పించిన ఆయన.. ఈ సందర్భంగా రాజకీయా జీవితంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. నేను ఏనాడూ పదవుల కోసం ఎదురు చూడలేదన్న ఆయన.. 2014లో బుచ్చయ్య చౌదరిని పక్కన పెట్టి రాజమండ్రి టికెట్ ఇస్తామని చంద్రబాబు చెప్పినా.. మంత్రి పదవి ఇస్తానన్నా నేను వద్దనానని చెప్పుకొచ్చారు.. ఇక, 2024 తర్వాత నేను రాజకీయాల్లో ఉండబోను అంటూ…