Magunta Srinivasulu Reddy: వైసీపీ సీటు ఇవ్వకుంటే ఏం చేద్దాం..? అనుచరులతో మాగుంట మంతనాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Magunta Srinivasulu Reddy: ఒంగోలులోని ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కార్యాలయం వద్ద అభిమానుల హడావుడి కొనసాగుతూనే ఉంది.. ఇటీవలి వైసీపీలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో మాగుంటను పరామర్శించేందుకు పలు నియోజకవర్గాల నుంచి తరలివస్తున్నారు పలువురు కార్యకర్తలు, అభిమానులు.. ఇక, విడివిడిగా ముఖ్య అనుచరులతో సమాలోచనలు చేస్తున్నారు మాగుంట.. మరోవైపు.. మాగుంట కార్యాలయానికి వచ్చి మర్యాద పూర్వకంగా కలిసి వెళ్లారు చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం.. కాసేపు కరణం బలరాంతో ఆంతరంగికంగా మాగుంట చర్చలు కొనసాగాయి.. కానీ, మాగుంట, కరణం భేటీలకు రాజకీయ ప్రాధాన్యత లేదంటున్నారు ఆయన ముఖ్య అనుచరులు..
Read Also: YS Sharmila: చంద్రబాబు ఇంటికి షర్మిల.. వైఎస్ తో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు..
Also Read
అయితే, ఇటీవలే మాగుంటకు సీటు లేదని స్పష్టం చేసింది వైసీపీ అధిష్టానం.. కానీ, మాగుంట సీటు కోసం మాజీమంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి పట్టుబట్టారు.. అధిష్టానంతో చర్చలు జరిపారు.. ఐప్యాక్ ప్రతినిధులతో సమావేశమై చర్చించారు.. అయినా.. ఇప్పటి వరకు మాగుంట సీటుపై ఎలాంటి క్లారిటీ రాలేదు.. దీంతో.. వైసీపీలో సీటు ఇవ్వకుంటే ఏం చేయాలనే అంశంపై అనుచరులతో మాగుంట మంతనాలు జరుపుతున్నారట.. అనుచరులతో సమావేశాల అనంతరం.. ఎంపీ మాగుంట.. తన కుటుంబ సభ్యులతో కూర్చుని ఏకాభిప్రాయానికి వచ్చే అవకాశం ఉందంటున్నారు.. వైసీపీ లేకుంటే పార్టీ మారే అవకాశం ఉందని.. టీడీపీ నేతలతో మాగుంట టచ్ లోనే ఉన్నారని ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!