Rummy Row: అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతుండగానే సభలో కూర్చొని రమ్మీ ఆడారంటూ మహారాష్ట్ర మంత్రి మాణిక్ రావ్ కోకాటేపై వచ్చిన ఆరోపణలు ఇప్పుడు తీవ్ర వివాదాస్పదమైంది. ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయాలంటూ విపక్షాలు నిరసన వ్యక్తం చేశాయి.
Jayashankar Bhupalpally: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పాడిరైతు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. భూపాలపల్లిలో నియోజకవర్గంలో ఒక వ్యక్తి బర్రెల షేడ్‌ను కూలగొట్టారని ఆ రైతు ఆవేదన వ్యక్తం చేస్తూ.. ఏకంగా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లోకి బర్రెలను తోలాడు. దీంతో క్యాంపు కార్యాలయంలో ఉన్న నేతలు, కార్యకర్తలు, ప్రజలు గందరగోళానికి గురయ్యారు. పోలీసుల వెంటనే అప్రమత్తమై చర్యలు తీసుకున్నారు. అసలు ఏం జరిగిందంటే..
Akhilesh Yadav: ఓ మసీదులో సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ) అధినేత ములాయం సింగ్ యాదవ్, ఆయన భార్య డింపుల్ యాదవ్‌లు సందర్శించడం వివాదాస్పదంగా మారింది. బీజేపీ ఇద్దరు నేతలపై విరుచుకుపడుతోంది. ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఇటీవల పార్లమెంట్ సమీపంలోని ఒక మసీదును సంరద్శించారు. మతపరమైన ప్రాంతంలో రాజకీయా సమావేశాలు నిర్వహించడం ఏమిటని బీజేపీ ప్రశ్నిస్తోంది. ఈ సమావేశంలో డింపుల్ యాదవ్ ధరించిన దుస్తులపై కూడా వివాదం చెలరేగింది.
Congress: కేరళ రాష్ట్రంలోని యూడీఎఫ్ నేతల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా తన వైపే మొగ్గు చూపుతున్నారనే సర్వే బయటకు వచ్చిందంటూ లోక్‌సభ ఎంపీ శశిథరూర్ చేసిన పోస్టుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఆయన వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.. మొదట ఆయన ఏ పార్టీలో కొనసాగుతున్నారో చెప్పాలని డిమాండ్ చేసింది.
తెలంగాణ ఉద్యమంలో సర్వం ఒడ్డి కొట్లాడిన వాళ్ళు అంతా ఇక్కడే ఉన్నారని.. పార్టీల కంటే ప్రజల అవసరాలు ముఖ్యం అని చెప్పే వాళ్లే ఇక్కడ ఉన్నారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. కృష్ణా నదీ జలాలపై ప్రగతి భవన్లో తెలంగాణ నీటి పారుదల శాఖ ఆధ్వర్యంలో ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ అజెండా ఎలా ఉంది.. రాజకీయ ఆర్థిక ప్రయోజనం ఏం పొందారు అనేది చర్చనీయాంశం కాదని.. ఇక్కడ తొమ్మిదిన్నరేళ్ళు.. కేసీఆర్…
ఛత్తీస్‌గఢ్‌లోని ఓ సభలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రసంగిస్తూ.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పేర్లను తప్పుగా ఉచ్చరించారు. ఈ అంశంపై బీజేపీ నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. రాయ్‌పూర్‌లోని సైన్స్ గ్రౌండ్లో జరిగిన ప్రసంగానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఖర్గే రాష్ట్రపతిని 'ముర్మా జీ' అని ఉచ్చరించారు. అయితే.. ఆయన వెంటనే సరిదిద్దుకుని 'ముర్ము' అని పలికారు. కొన్ని సెకన్ల తర్వాత..…
జపాన్, దక్షిణ కొరియాతో సహా 14 దేశాలపై డొనాల్డ్ ట్రంప్ కొత్త సుంకాలను ప్రకటించారు. దీని ప్రభావం అమెరికా స్టాక్ మార్కెట్ పతనం రూపంలో కనిపించింది. మరోవైపు, ట్రంప్‌తో కొనసాగుతున్న వివాదం, కొత్త రాజకీయ పార్టీ ప్రకటనతో ఎలాన్ మస్క్‌కు ఎదురుదెబ్బ తగిలింది. గత 24 గంటల్లో, మస్క్ కంపెనీ టెస్లా స్టాక్ క్రాష్ అయ్యింది. దీని కారణంగా 15.3 బిలియన్ డాలర్లు (రూ. 1.31 లక్షల కోట్లకు పైగా) నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. గత కొన్ని…
కొత్త అధ్యక్షుడిని డమ్మీ డమ్మీ అని అందరన్నారని.. తాను డమ్మిని కాదు మమ్మీకి డాడీని అన్న రామ్ చందర్ రావుకు ఒక మాట చెప్పాలనుకుంటున్నానన ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. డమ్మీ కాదని నిరూపించుకునేందుకు రామ్ చందర్ రావుకు ఇది మంచి అవకాశమన్నారు. ఫాతిమా కాలేజ్ పై లీగల్ టీమ్ ను ఏర్పాటు చేయాలని.. లీగల్ టీమ్ తో హై కోర్టులో పిటిషన్ దాఖలు చేసీ ఫాతిమా కాలేజ్ కూల్చేందుకు కొట్లాడాలని తెలిపారు. హైడ్రా వల్ల అనేక పేద…
Minister Seethakka : బీఆర్ఎస్ నేత కేటీఆర్ పై మంత్రి సీతక్క మండిపడ్డారు. మంగళవారం ములుగు పట్టణంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనిపై తప్పుడు ప్రచారం చేస్తూ, వ్యక్తిగత దాడులకు దిగితే కేటీఆర్ నాశనం తప్పదని హెచ్చరించారు. ” మీ చెల్లి నీ మీద దుమ్మెత్తి పోస్తుంది.. ఆమె పరిస్థితిని గమనించు కేటీఆర్!” అంటూ ఆమె ఫైర్ అయ్యారు. చిల్లర రాజకీయాల నుంచి బయటపడాలని హితవు పలికిన సీతక్క, “నువ్వు నిర్వహించిన…
Bandi Sanjay: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ సభ పేరును ‘‘సామాజిక అన్యాయ సమర భేరీ’’గా మార్చుకోండి అని సూచించారు. ఏం ఉద్దరించారని సభ పెడుతున్నారు? అని అడిగారు. 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఒక్క బీసీకైనా ప్రధాని పదవిచ్చారా?.. అర్ధశతాబ్ద కాంగ్రెస్ పాలనలో ఏనాడైనా బీసీని సీఎం చేశారా?.