Janasena: జనసేనకు చెందిన కొందరి నేతల డర్టీ పనులు పార్టీపై ప్రభావం చూపిస్తున్నాయి. ప్రతిపక్షాలు మాత్రమే కాదు, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సామాన్యులు కూడా ఘాటుగా స్పందిస్తున్నారు. కొందరు నేతల డర్టీ వీడియోలు, లైంగిక ఆరోపణలు, కుటుంబ కలహాలు ఇలా ప్రతి సంఘటన కూడా ప్రత్యక్షంగా పార్టీపై ప్రతికూలంగా ప్రభావం చూపుతున్నాయి. ఇవేనా ప్రజాస్వామ్యానికి కొత్త గళంగా ఎదిగిన జనసేన నాయకత్వ లక్షణాలు అన్న ప్రశ్నలు ప్రజల నోట మొదలయ్యాయి. వివాదాలకు కారణమైన నేతలపై అధినేత పవన్ కళ్యాణ్… ఆలస్యం చేయకుండా చర్యలు తీసుకుంటున్నప్పటికీ… ప్రజా విశ్వాసాన్ని కోల్పోయే ప్రమాదం నుంచి బయటపడాల్సిన బాధ్యత మాత్రం మిగిలే ఉంది.
Read Also: Donald Trump: 50 రోజుల్లో యుద్ధం ఆపకుంటే.. రష్యాకు ట్రంప్ వార్నింగ్..
వరుస విమర్శలు, వివాదాలు జనసేనను చుట్టుముడుతున్నాయి. పవన్ కళ్యాణ్ నిజాయితీ, నిబద్ధతకు పెద్దపీట వేస్తూ పార్టీని పటిష్టానికి కృషి చేస్తుండగా… కింది స్థాయిలో మాత్రం కొంతమంది నేతల డర్టీ పనులు పార్టీకి మచ్చ తెస్తున్నాయి. ఇటీవల కొందరు జనసేన నేతలు మర్డర్ కేసులు, మోసం, వేధింపుల ఆరోపణలతో వార్తల్లో నిలుస్తున్నారు. ప్రేమ పేరుతో యువతిని మోసం చేశాడనే కేసులో కిరణ్ రాయల్, మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అరెస్ట్ కూడా అయ్యారు. మహిళా డాక్టర్‌పై వేధింపుల కేసులో మరో నేత సస్పెండ్ అయ్యారు. తాజాగా శ్రీకాళహస్తికి చెందిన కారు డ్రైవర్ శ్రీనివాసులు అలియాస్ రాయుడు హత్య కేసులో శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ కోట వినుత, ఆమె భర్త చంద్రబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. దాంతో కోట వినుతను పార్టీ నుంచి బహిష్కరించింది జనసేన.
Read Also: Supreme Court: ప్రధాని మోడీ-ఆర్ఎస్ఎస్‌పై కార్టూన్, సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం..
ఈ తరహా ప్రవర్తనపై జనసేన గతంలోనే ఇతర పార్టీలపై తీవ్రంగా విమర్శలు చేసింది. వైసీపీ నేతలు అంబటి రాంబాబు, గోరంట్ల మాధవ్, అవంతి శ్రీనివాస్, అనంతబాబులపై మండిపడింది. ఇప్పుడు అవే విమర్శలు జనసేనపై వినిపిస్తున్నాయి. ప్రజల్లో నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే నేతలు ప్రవర్తన హుందాగా ఉండాలి. కానీ… ప్రస్తుత పరిణామాలతో జనసేన ప్రజల్లో నమ్మకాన్ని కోల్పోయే ప్రమాదం ఎక్కువగా కనిపిస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకి మేలుచేసే విధంగా వ్యవహరించాలి కానీ ఇప్పుడు తమ నేతల వ్యక్తిగత వ్యవహారాలు సెట్ చేసుకోవడంలోనే గడిపే పరిస్థితి ఆ పార్టీకి వచ్చిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇది ఇలాగే కంటిన్యూ అయితే… భవిష్యత్తులో పార్టీకి డ్యామేజీ తప్పదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.