మియాపూర్ మెట్రో స్టేషన్ వద్ద లారీ బీభత్సం సృష్టించింది. నో ఎంట్రీ రోడ్లోకి అత్యంత వేగంగా దూసుకొచ్చిన లారీ.. రోడ్డు మధ్యలో ఉన్న ట్రాఫిక్ అంబరిల్లాను ఢీకొన్నది. ఈ సమయంలో అక్కడే ఉన్న ముగ్గురు పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. అక్కడ ట్రీట్మెంట్ పొందుతూ హోంగార్డ్ సింహాచలం మృతి చెందాడు. పోలీస్ కానిస్టేబుల్ రాజవర్ధన్, వికేందర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యా్ప్తు ప్రారంభించినట్లు వెల్లడించారు.…
జమ్మూకశ్మీర్‌లోని ఉధంపూర్ లో ఇద్దరు పోలీసుల మృతదేహాలు లభ్యమయ్యాయి. జిల్లాలో ఆదివారం ఉదయం ఇద్దరు పోలీసులు బుల్లెట్ గాయాలతో మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. పరస్పర విబేధాలే ఈ ఘటనకు కారణమని భావిస్తున్నారు.
అత్యాచారం కేసులో ఏపీకి చెందిన కొందరు పోలీసులకు భారీ ఊరట లభించింది. వారిని నిర్దోషులుగా కోర్టు విడుదల చేసింది. రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఒక గ్రామంలో 16 ఏళ్ల క్రితం 11 మంది గిరిజన మహిళలపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన 21 మంది పోలీసులను ప్రత్యేక కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.
Tragedy: మహారాష్ట్ర షోలాపూర్ జిల్లా బార్షిలో మార్చి 5న మైనర్ బాలికపై వేధింపులు జరిగాయి. ఈ కేసులో అక్షయ్ మానే, నామ్‌దేవ్ దాల్వీ ఇద్దరిపై పోస్కో చట్టం కింద కేసు నమోదు చేశారు.