Triple Murder In Bihar: బీహార్ రాష్ట్రంలోని బెగుసరాయ్‌లో దారుణం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని గొంతు కోసి హత్య చేసేందుకు ట్రై చేశారు. ఈ ఘటనలో భార్య, భర్తతో పాటు పదేళ్ల కుమార్తె మృతి చెందగా.. కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ దారుణానికి పాల్పడిన నేరస్తులు ఆ కుటుంబంలోని నలుగురిపైన కూడా యాసిడ్ పోశారు. గాయపడిన కుమారుని పరిస్థితి తీవ్ర విషమంగా ఉంది.
Read Also: Minister Vasamsetti Subhash: ఒక్క ఫ్యాక్టరీ రాలేదు.. 8 ఫ్యాక్టరీలు రాష్ట్రాన్ని వీడాయి..!
అయితే, బచ్వారా పోలీస్ స్టేషన్ పరిధిలోని రషీద్‌పూర్‌లోని చిరంజీవిపూర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఇక, సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ స్టార్ట్ చేశారు. ఈ గ్రామానికి చెందిన సంజీవన్ మహతో తన కుటుంబ సభ్యులందరితో పాటు ఇంట్లో నిద్రిస్తున్న టైంలో.. నేరస్తులు పదునైన ఆయుధంతో సంజీవన్ మహ, సంజీతా దేవి, కుమారుడు అంకుష్‌కుమార్, కుమార్తె సప్నా కుమారిల గొంతు కోసేశారు.. ఈ ఘటనలో భర్త, భార్య, కుమార్తె అక్కడికక్కడే మరణించగా.. కుమారుడు తీవ్రంగా గాయపడగా.. ప్రస్తుతం ఆస్పత్రిలో అతడు చికిత్స పొందుతున్నాడు. కాగా, స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న బచ్వారా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. అయితే, సంజీవన్ మహతోకు ఇద్దరు భార్యలు ఉన్నారని పోలీసుల దర్యాప్తులో తేలింది. కుటుంబ విభేదాల కారణంగానే ఈ ఘోరం జరిగివుంటుందని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.