ఒకే అమ్మాయిని ప్రేమించిన ఇద్దరు సోదరులు తమ ప్రియురాలి కోసం దొంగలుగా మారారు. తన మేకప్, బట్టలు, ఖరీదైన అభిరుచులను నెరవేర్చడం కోసం దొంగ అవతారమెత్తారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో చోటు చేసుకుంది. దొంగతనం ఆరోపణలపై ఈ సోదరులను పోలీసులు అరెస్టు చేశారు.
నందికొట్కూరులో మహిళ హత్య కేసులో సంచల విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.. నంద్యాల జిల్లాలో బిహారీ యువకుడు, మరొకరితో కలసి ఓ సస్పెక్ట్ షీట్లో ఉన్న మహిళను తుపాకీతో కాల్చి , నరికి చంపిన ఘటన సంచలనం సృష్టిస్తుండగా.. ఈ కేసులో కొత్త అంశాలు తెరపైకి వస్తున్నాయి..
ప్రకాశం బ్యారేజ్ గేట్లను బోట్లు ఢీకొట్టిన ఘటనపై కేసు నమోదు చేశారు పోలీసులు.. బెజవాడ వన్ టౌన్ పోలీసులు ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.. అయితే, ఈ ఘటనపై విచారణ జరపాలని ఇరిగేషన్ ఈఈ కృష్ణారావు శుక్రవారం ఫిర్యాదు చేశారు
Harassment: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కన్నౌజ్‌లో దారుణం చోటు చేసుకుంది. మేనల్లుడు తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసేందుకు అతని ఇంటికి వెళ్లగా, ఆమె భర్త మరియు అతని కుటుంబ సభ్యులు సదరు వివాహితపై దాడి చేసి తల గుండు గీయించారు.
ఫిర్యాదు చేసేందుకు వస్తే.. పోలీసులు నిరాకరించారని ఓ వ్యక్తి కోపంతో రగిలిపోయి తహశీల్దార్ వాహనానికి నిప్పు పెట్టాడు. ఈ ఘటన కర్ణాటకలోని చిత్రదుర్గలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడానికి రాగా.. ఆమె ఫిర్యాదును స్వీకరించేందుకు పోలీసులు నిరాకరించారు. ఈ క్రమంలో.. మనస్తాపం చెందిన ఆ మహిళ కొడుకు ప్రభుత్వ వాహనానికి నిప్పుపెట్టాడు. నిందితుడు పృథ్వీరాజ్ గా గుర్తించారు.
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడిలో మహిళ అనుమానాస్పద మృతి కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు గుంటూరు పోలీసులు.. అయితే, విచారణలో షాకింగ్ విషాలు వెలుగు చూశాయి.. డబ్బులు అప్పు తీసుకుని, అడిగితే ఆ మహిళల ముఠా హత్యలు చేస్తున్నట్టు గుర్తించారు..
TDP Office Attack Case: గుంటూరు జిల్లాలోని తెలుగు దేశం కేంద్ర కార్యాలయం పై దాడి ఘటనలో కీలక నేతల అరెస్టుపై ఉత్కంఠ కొనసాగుతుంది. కొంత మంది కీలక నేతలను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారని జోరుగా ప్రచారం జరుగుతుంది. అసత్య ప్రచారాలను పోలీసు అధికారులు కొట్టి పారేస్తున్నారు.
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘాజిపుర్‌లో దారుణం చోటు చేసుకొంది. ఈ ఘటనలో అంబులెన్స్ డ్రైవరే పేషెంట్ భార్యతో అసభ్యకరంగా ప్రవర్తించి.. ఆమె భర్తకు పెట్టిన ఆక్సిజన్‌ను తొలగించడంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు.
యుపిలోని మదర్సాలకు ఉగ్రవాద సంబంధాలపై తరచూ ఆరోపణలు వస్తుంటాయి. అయితే తాజాగా ప్రయాగ్‌రాజ్‌లోని ఒక మదర్సా నుంచి ఓ సంచలనాత్మక వార్త వెలుగులోకి వచ్చింది. ఈ మదర్సా నకిలీ నోట్లను ముద్రించే ఫ్యాక్టరీగా మారింది.
Botsa Satyanarayana: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్‌కు అండగా న్యాయ సహాయం కోసం గుడివాడ మాజీ మంత్రి పేర్ని నాని, మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్ వెళ్లారు. అయితే, అక్కడ వారిపై కార్లపై టీడీపీ, జనసేన కార్యకర్తలు దాడి చేయడం దారుణమని ఎమ్మెల్సీ బొత్స నారాయణ అన్నారు.