హైదరాబాద్ నుంచి విజయవాడ మధ్య రాకపోకలు పూర్తిగా బంద్ అయ్యాయి. మున్నేరు వరద ఉదృతితో నేషనల్ హైవే పై వరద నీరు చేరింది. దీంతో నందిగామ మండలం ఐతవరం గ్రామం దగ్గర 65వ జాతీయ రహదారి పైకి వరద ప్రవాహం కొనసాగుతుంది. నేషనల్ హైవేపై వరద నీరు చేరటంతో నందిగామ పోలీసులు రాకపోకలను పూర్తిగా నిలిపి వేశారు.
Car Wash: మహారాష్ట్ర ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ కు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. అందులో ఓ పోలీసు తన కారును కడుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వీడియోను షేర్ చేస్తూ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ప్రభుత్వంపై ప్రతిపక్ష నేతలు ప్రశ్నలు సంధించారు. విశేషమేమిటంటే.. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు మరికొద్ది నెలలు మాత్రమే మిగిలి ఉన్న తరుణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ సప్కల్ కూడా వీడియోను షేర్ చేశారు. పోలీసు దుర్వినియోగానికి…
ముంబై నటి కాదంబరి జత్వానీ ఇవాళ విజయవాడకు వచ్చే ఛాన్స్ ఉంది. ఐపీఎస్ అధికారులు తనను తన ఫ్యామిలీని అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపణలు చేస్తోంది జత్వానీ. ప్రభుత్వం విచారణకు ఆదేశించటంతో ఈరోజు విజయవాడ సీపీ రాజశేఖర్‌బాబును జత్వానీ కలుస్తుందని సమాచారం.
నిజామాబాద్ జిల్లాలో మటన్ ముక్కలు పంచాయితీ పెట్టాయి.. పెళ్లి విందులో రసాభాసకు కారణంగా మారాయి.. పెళ్లి భోజనంలో మాంసాహారం కోసం వరుడు, వధువు తరపు బంధువులు పరస్పరం దాడులు చేసుకున్నారు.. అంతేకాదు.. 19 మందిపై కేసులు కూడా నమోదు అయ్యాయి..
Physical Assaults: తమిళనాడు రాష్ట్రంలో నాగర్ కోయిల్‌లోని కేంద్రీయ విద్యాలయ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు ఓ ఉపాధ్యాయుడిని పోలీసులు అరెస్టు చేశారు.
మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలోని రాజ్‌కోట్ కోటలో ఉన్న 35 అడుగుల ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం సోమవారం బలమైన గాలులకు కూలిపోయింది. ఈ విగ్రహాన్ని గత ఏడాది (4 డిసెంబర్ 2023) ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆవిష్కరించారు.
ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహం కూలిన ఘటనపై భారత నౌకాదళం విచారణకు ఆదేశించింది. ఈ విగ్రహాన్ని గతేడాది నేవీ డే రోజున ప్రధాని మోడీ ఆవిష్కరించారు. అలాగే ఈ విషయంపై తక్షణమే విచారణ జరిపి వీలైనంత త్వరగా విగ్రహం మరమ్మతులు చేపట్టేందుకు ఒక బృందాన్ని నియమించినట్లు తెలిపారు.
Pakistan: పాకిస్థాన్ దేశంలో వేర్పాటువాద సంస్థ బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీకి చెందిన సాయుధ బలగాలు మారణకాండ సృష్టించాయి. బలూచిస్థాన్ ప్రావిన్స్‌లోని పలు ప్రాంతాల్లో పోలీసు స్టేషన్లు, రైల్వే ట్రాకులు, వాహనాలపై కాల్పులకు పాల్పడి దాదాపు 70 మందిని హత మార్చాయి.
అమెరికాలోని కాలిఫోర్నియాలో ఓ దుర్మార్గుడైన కొడుకు తన వృద్ధ తల్లిదండ్రుల గొంతు కోసి హత్య చేశాడు. ఈ క్రమంలో.. నిందితుడిని అరెస్ట్ చేసేందుకు వచ్చిన పోలీసులను చూసి ఓ పాట పాడాడు. హంతకుడి చర్యలను చూసి పోలీసులు సైతం షాక్‌కు గురయ్యారు. కాగా.. నిందితుడు తప్పించుకునే క్రమంలో అతన్ని పోలీసులు షూట్ చేశారు. అనంతరం అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.