Palnadu: పల్నాడు జిల్లా నరసరావుపేటలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. స్నేహితురాలితో ఏర్పడిన స్వల్ప వివాదంతో ఓ స్టూడెంట్ భవనంపై నుంచి దూకి సూసైడ్ చేసుకుంది.
ఛత్తీస్గఢ్లోని కంకేర్, నారాయణపూర్ జిల్లాల సరిహద్దులోని మాద్ ప్రాంతంలో పోలీసులకు, నక్సలైట్లకు మధ్య ఎన్కౌంటర్ జరుగుతోంది. ఎన్కౌంటర్ను పోలీసు సూపరింటెండెంట్ ఐకె ఎలిసెలా ధృవీకరించారు. కోర్ ఏరియా కావడంతో సైనికులు సంప్రదించలేకపోతున్నారు. కంకేర్ నక్సలైట్ ఎన్కౌంటర్లో చాలా మంది నక్సలైట్లు మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇది అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. ఘటనా స్థలం నుంచి ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఎన్ కౌంటర్ కొనసాగుతోంది.
Canada- India Row: భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్తత కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో కెనడాలోని టొరంటోలో ఇండియన్ సింగర్స్ ఉంటున్న ప్రాంతంలో కాల్పుల ఘటన కలకలం రేపుతుంది. ఈ ఘటన రికార్డింగ్ స్టూడియో బయట జరిగింది. దుండగులు దాదాపు 100 రౌండ్ల కాల్పులు జరిపినట్లు తెలుస్తుంది.
విశాఖపట్నం గాజువాకలో దారుణం జరిగింది.. పెదగంట్యాడ లో యువతిపై జమ్మూ కాశ్మీర్కు చెందిన నీరజ్ శర్మ రాడ్తో దాడి చేశాడు.. అడ్డుకునేందుకు యత్నించిన మరో ఇద్దరిపై కూడా దాడికి పాల్పడ్డాడు.. అయితే, బాధితురాలు కేకలు వేయడంతో నిందితుడు పారిపోయాడు.. ఉన్మాది దాడిలో గాయపడిన యువతిని ఆస్పత్రికి తరలించారు స్థానికులు.. ఇక, ప్రేమోన్మాది చేతిలో తీవ్రంగా గాయపడ్డ యువతికి మెరుగైన వైద్యం కోసం కిమ్స్ హాస్పిటల్ కు తరలించారు... తలపై సుమారు 30 కుట్లు పడ్డాయి.. ప్రేమోన్మాది దాడి…
Fake Certificates: ఫేక్ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ముఠా గుట్టురట్టు అయింది. నకిలీ ఓటర్ కార్డు, ఆధార్, బర్త్ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ముఠాను నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. మహంకాళి పోలీసులతో కలిసి జాయింట్ అపరేషన్ నిర్వహించారు. ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో డ్రోన్ల సాయంతో గంజాయి సాగుకు చెక్ పెట్టేందుకు ఏపీ ప్రభుత్వం సిద్దమైంది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో డ్రోన్లతో గంజాయి సాగును అరికట్టేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు.
Patnam Narender Reddy: వికారాబాద్ జిల్లాలో టెన్షన్ వాతవరణం కొనసాగుతుంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని వికారాబాద్ లోని అడిషనల్ ఎస్పీ కార్యాలయం డీటీసీ నుంచి పరిగి పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు.
విశాఖ నగరంలో గంజాయి పంట కలకలం రేపింది.. కేజీహెచ్ లేడీస్ హాస్టల్ వెనుక ప్రాంతంలో గుట్టుచప్పుడు కాకుండా గంజాయి పండిస్తున్నారు కొంతమంది యువకులు.. గత రెండేళ్లుగా గంజాయి పండిస్తు మత్తుకు బానిసలుగా మారారు.. ఏజెన్సీ నుండి తీసుకొచ్చి ఇక్కడ పండిస్తున్నట్లు తెలిపారు పోలీసులు.. గంజాయి సేవించి మిగిలిన వాటిని నగరంలో స్టూడెంట్స్ కి విక్రయిస్తున్నారు గంజాయి గ్యాంగ్.. పక్కా సమాచారంతో గుట్టురట్టు చేశారు విశాఖపట్నం వన్ టౌన్ పోలీసులు.
విశాఖపట్నంలో దారుణమైన ఘటన వెలుగుచూసింది.. ఆరు కోట్ల రూపాయలు ఖర్చు చేసి పెళ్లి చేశారు.. కానీ, అదనపు కట్నం కోసం వేధింపులు ఆగలేదు.. చివరకు అత్తింటి వేధింపులు తాళలేక వివాహిత ప్రాణాలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది.. అత్తింటివారి అదనపుకట్నం కోసం వేధించారు.. అంతేకాదు తమ కూతురిని హత్య చేశారని తల్లి తరపువాళ్లు ఆరోపిస్తు్నారు.
వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీంద్రా రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణలోని మహబూబ్ నగర్ సరిహద్దులో అతన్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. భారీ భద్రత నడుమ కడప పీఎస్కు తరలించినట్లు సమాచారం.