ప్రకాశం జిల్లా ఒంగోలులో పోలీసు విచారణకు వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ హాజరవుతాడా? లేదా? అనే ఉత్కంఠకు తెరపడినట్టు అయ్యింది.. తాను కేసు విచారణకు రాలేంటూ పోలీసులకు సమాచారం ఇచ్చారు రాంగోపాల్ వర్మ.. ఈ మేరకు రూరల్ సీఐ శ్రీకాంత్ బాబుకు వాట్సాప్ లో మెసేజ్ పెట్టారట ఆర్జీవీ.. తాను సినిమా షూటింగ్ బిజీ షెడ్యూల్ ఉన్న నేపథ్యంలో.. నాలుగు రోజులు గడువు కోరారు వర్మ.. కేసు దర్యాప్తునకు తాను పూర్తిగా సహకరిస్తానని రాంగోపాల్ వర్మ పోలీసులకు…
సోషల్ మీడియా వేదికగా ఎన్నో మోసాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి.. మనకు తెలిసి వ్యక్తి.. సోషల్ మీడియాలో రిక్వెస్ట్ పెట్టినా? అది అసలు ఖాతానేనా..? ఇంకా ఎవరైనా ఆ పేరుతో ఖాతా ఓపెన్ చేశారా? అనేది కూడా తెలియని పరిస్థితి.. ఇప్పుడిదంతా ఎందుకంటే.. చెల్లి పేరుతో ఫేస్బుక్ ఖాతాను ఓపెన్ చేసిన ఓ అక్క.. ఓ యువకుడితో పరిచయం పెంచుకుంది.. అంతేకాదు.. అతడి నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసింది.. బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో.. ఆత్మహత్యాయత్నం…
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇప్పుడు ఏం చేస్తారు? అనేది ఉత్కంఠగా మారింది.. ఓ వైపు పోలీసుల పెట్టిన డెడ్లైన్ ముంచుకొస్తుంది.. మరోవైపు.. హైకోర్టులోనూ ఎదురుదెబ్బ తగిలింది ఈ నేపథ్యంలో ఆర్జీవీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది.. ఇవాళ ప్రకాశం జిల్లా మద్ధిపాడు పోలీస్ స్టేషన్లో డైరెక్టర్ రాంగోపాల్ వర్మ విచారణకు హాజరుకావాల్సి ఉంది..
Maharashtra: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల హడావుడి నెలకొన్న సమయంలో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. ఎన్సీపీ (ఎస్పీ) నేత, మాజీ మంత్రి అనిల్ దేశ్ముఖ్ వెహికిల్ పై నాగ్పుర్ జిల్లాలో గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు.
యర్రగొండపాలెం నియోజకవర్గానికి చెందిన వైసీపీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ పై తాజాగా పోలీసులు నాలుగు కేసులు నమోదు చేశారు..
West Bengal Violence: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ముర్షిదాబాద్ జిల్లాలోని బెల్దంగా ప్రాంతంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు జరిగాయి. దీంతో పరిస్థితులను చక్కదిద్దేందుకు పోలీసులు ఆ ప్రాంతంలో నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నారు.
Punjab: పంజాబ్ రాష్ట్రంలో ఆదివారం ఒక్కరోజున 400కి పైగా పంట వ్యర్థాలు తగుల బెట్టారు. ఈ సీజన్లో పంజాబ్ లో కేసుల సంఖ్య 8,404కి చేరిపోయింది. రిమోట్ సెన్సింగ్ డేటా సాయంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
Manipur: ఈశాన్య రాష్ట్రం మణిపూర్ రావణకాష్టంలా రగిలిపోతుంది. రెండు జాతుల మధ్య వైరంతో ఏడాదిన్నరగా అక్కడ పరిస్థితి దారుణంగా ఉంది. ఈ నేపథ్యంలో మణిపూర్లో శాంతిభద్రతలను పరీరక్షించడంతో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం విఫలం కావడంతో ఎన్పీపీ మద్దతు ఉపసంహరించుకుంది.
కుకీ వర్గానికి చెందిన మిలిటెంట్లు మైటీ వర్గానికి చెందిన ఓ ఫ్యామిలినీ కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేయడంతో మరోసారి రాష్ట్రంలో ఉద్రిక్తత ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో హత్య చేసిన వారిని 24 గంట్లలో అరెస్ట్ చేసి శిక్షించాలని మైటీ సామాజిక వర్గం నేతలు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా కుకీ వర్గానికి చెందిన మిలిటెంట్లు జిరిబం జిల్లాలో ఆరుగురిని దారుణం చంపేసి ఓ నది దగ్గర పడేశారు.
హైదరాబాద్, ఒడిశాకు చెందిన పోలీసు బృందాలు శనివారం బాలాసోర్ జిల్లాలోని ఓ గ్రామంలో దాడి చేశాయి. ఈ దాడి అధికారులు సైతం ఆశ్చర్య పరిచింది. ఇక్కడ ఆవు పేడ కుప్ప నుంచి భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు శనివారం ఓ అధికారి వెల్లడించారు. కమ్రాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాదమందరుని గ్రామంలో ఈ రికవరీ చేసినట్లు తెలిపారు. వాస్తవానికి, హైదరాబాద్, ఒడిశా నుంచి పోలీసు అధికారుల బృందం గ్రామానికి చేరుకుంది.