6 హెబియస్ కార్పస్ పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. పోలీసుల అక్రమ నిర్బంధాలపై బాధిత కుటుంబ సభ్యులు పిటిషన్లు వేశారు. ఈ క్రమంలో న్యాయస్థానం విచారణ చేపట్టింది. అక్రమంగా నిర్బంధించిన ఆరుగురు ఎక్కడున్నారో చెప్పాలని ప్రభుత్వ న్యాయవాదులకు కోర్టు ఆదేశించింది. లోకేష్ అనే సోషల్ మీడియా ప్రతినిధి హెబియస్ కార్పస్ పిటిషన్ పై విచారణలో ఎస్సై జానకి రామయ్య కోర్టుకు హాజరయ్యారు. ఈ క్రమంలో.. ఎస్సై జానకి రామయ్య స్టేట్మెంట్ను న్యాయస్థానం రికార్డు చేసింది.
అమృత్సర్ గోల్డెన్ టెంపుల్ కాంప్లెక్స్‌లో 25 ఏళ్ల యువతి ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల సమాచారం ప్రకారం.. బాలిక గురుద్వారా బాబా అటల్ రాయ్ ఏడో అంతస్తు నుంచి దూకింది. ఈ ఘటన ఆలయ పరిసరాల్లో సంచలనం సృష్టించింది. పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
Shah Rukh Khan: బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ను చంపేస్తామంటూ దుండగులు ఆయనకు కాల్ చేశారు. దీనిపై మహారాష్ట్రలోని బాంద్రా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. ఎఫ్ఐఆర్ బీఎన్ఎస్ 308(4), 351(3)(4) సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్నారు.
Domestic Violence: తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో ఓ పారిశ్రామికవేత్త ఇంటిలో పని చేస్తున్న 16 ఏళ్ల బాలిక దారుణ హత్యకు గురైంది. బాలిక హత్య కేసులో పారిశ్రామికవేత్త ఆయన భార్య సహా ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను చంపుతామని బెదిరించిన ఓ మహిళను పోలీసులు, ఏటీఎస్‌లు అదుపులోకి తీసుకున్నారు. సదరు మహిళ మానసికంగా బలహీనురాలు అని పోలీసులు చెబుతున్నారు. యోగి 10 రోజుల్లో రాజీనామా చేయకుంటే బాబా సిద్ధిఖీలా చంపేస్తామని నిందితురాలు ముంబయి పోలీస్ కంట్రోల్ రూమ్‌లో మెసేజ్ చేసింది.
Cyber Fraud: సైబర్ నేరగాళ్ళ మోసాలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఏదో ఒక రూపంలో అమాయకులు నుండి అందిన కాడికి దోచుకుంటున్నారు. తాజాగా సైబర్ నేరగాళ్లు నిరుద్యోగులను టార్గెట్ చేస్తున్నారు.
KTR Tweet: తెలంగాణ ప్రభుత్వం పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. పోరాడి సాధించుకొని పదేళ్లు స్వేచ్చగా ఊపిరి పీల్చుకున్న తెలంగాణలో మళ్లీ ఎమర్జెన్సీ రోజులొచ్చాయని మండిపడ్డారు
ప్రియురాలి ఇంట్లోనే ప్రియుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉయ్యూరులో కలకలం రేపుతోంది.. గతంలో ప్రేమించుకున్న ఓ జంట.. మనస్పర్ధలు రావడంతో 2021లో విడిపోయారు.. అప్పటి నుంచి వాళ్లు దూరంగానే ఉంటున్నారని చెబుతున్నారు.. అయితే, గత రాత్రి తన మాజీ ప్రియురాలి ఇంటికి వెళ్లిన ప్రియుడు.. తనకు ఇచ్చి పెళ్లి చేయాలని.. సదరు యువతి కుటుంబ సభ్యులను అడిగాడు.. కానీ, వాళ్లు పెళ్లికి నిరాకరించడంతో.. అక్కడే ఆత్మహత్య చేసుకున్నట్టుగా చెబుతున్నారు..
West Bengal: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని అధికార తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి దిగారు. వీరిపై వేర్వేరు ప్రాంతాల్లో మింఖాకు చెందిన టీఎంసీ ఎమ్మెల్యే ఉషారాణి మండల్, సందేశ్‌ఖాలీకి చెందిన టీఎంసీ ఎమ్మెల్యే సుకుమార్ మహతా పైన ఈ దాడులు జరిగాయి.