AP Crime: సోషల్ మీడియా వేదికగా ఎన్నో మోసాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి.. మనకు తెలిసి వ్యక్తి.. సోషల్ మీడియాలో రిక్వెస్ట్ పెట్టినా? అది అసలు ఖాతానేనా..? ఇంకా ఎవరైనా ఆ పేరుతో ఖాతా ఓపెన్ చేశారా? అనేది కూడా తెలియని పరిస్థితి.. ఇప్పుడిదంతా ఎందుకంటే.. చెల్లి పేరుతో ఫేస్‌బుక్ ఖాతాను ఓపెన్ చేసిన ఓ అక్క.. ఓ యువకుడితో పరిచయం పెంచుకుంది.. అంతేకాదు.. అతడి నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసింది.. బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో.. ఆత్మహత్యాయత్నం చేసింది..
Read Also: Free Ration : పేదలకు ఉచిత రేషన్ అందడం లేదు.. ఏటా రూ.69000 కోట్ల విలువైన ధాన్యాలు మాయం
కర్నూలు జిల్లా పత్తికొండ మండలం చక్రాలలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. లావణ్య అనే మహిళ తాజాగా ఆత్మహత్యాయత్నం చేసింది.. దీంతో.. ఆమెను పత్తికొండ ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు.. అయితే, హైదరాబాద్ కు చెందిన సాయిలు అనే వ్యక్తి నుంచి కోటి 20 లక్షల రూపాయలు లావణ్య కాజేసినట్లు ఆరోపణలున్నాయి. ఫేస్ బుక్ లో తన చెల్లెలు ప్రియాంక ఫోటోతో అకౌంట్ క్రియేట్ చేసిన లావణ్య.. ఆ ఫేస్ బుక్ అకౌంట్ ద్వారా హైదరాబాద్‌కు చెందిన సాయిలుతో పరిచయం పెంచుకుంది.. ఫేస్‌బుక్ పరిచయం కాస్తా.. చాటింగ్.. ఆ తర్వాత నంబర్ల షేరింగ్.. వాట్సాప్ చాటింగ్.. ఫోన్ సంభాణ వరకు వెళ్లింది.. ప్రియాంక మాట్లాడుతున్నట్టు సాయిలుతో మాట్లాడిన లావణ్య.. అతనికి వివిధ కారణాలు చెబుతూ.. క్రమంగా డబ్బులు వసూలుచేయడం మొదలు పెట్టింది. ఫేస్ బుక్ పరిచయంతోనే ఏకంగా రూ. కోటి 20 లక్షలు సాయిలు నుంచి లావణ్య వసూలు చేసింది. అయితే, తనకు న్యాయం చేయాలంటూ పత్తికొండ పీఎస్ ను బాధితుడు సాయిలు ఆశ్రయించాడు. రెండు రోజులుగా పీఎస్ లో పంచాయితీ జరుగుతోంది. ఈ నేపథ్యంలో లావణ్య ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపుతోంది.. అయితే, బాధితుడు సాయిలును బెదిరించేందుకు లావణ్య ఆత్మహత్యాత్నం చేసిందని స్థానికులు అంటున్నారు.. ఏదేమైనా జాగ్రత్త గురూ.. సోషల్ మీడియాలో అసలు ఎవరో.. ఫేక్ ఎవరో తెలుసుకొని మసులుకో..