తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో హతుడి మామ అమృతరావు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసింది. ఆ కేసులో మరో నిందితుడు అబ్దుల్ బారీకి గుండె నొప్పి రావడంతో అతడిని నిమ్స్ కు తరలించారు జైల్ అధికారులు. గుండె నొప్పి రావడంతో ఆస్పత్రిలో చేర్పించామని, చికిత్స జరుగుతోందని జైలు అధికారులు తెలిపారు. ప్రణయ్ హత్య కేసులో అమృత తండ్రి మారుతీ రావుకు సుపారీ గ్యాంగ్ ను సమకూర్చి పెట్టాడు రౌడీ షీటర్ అబ్దుల్…
ఆంధ్రప్రదేశ్‌లో అతి పెద్ద హవాలా రాకెట్ గుట్టు రట్టు అయ్యింది… బంగారం స్మగ్లింగ్, జీఎస్టీ ఎగవేతే లక్ష్యంగా హవాలా లావాదేవీలు జరుగుతున్నట్టు చెబుతున్నారు అధికారులు.. ట్రావెల్స్ బస్సుల ద్వారా హవాలా సొమ్ము, బంగారం రవాణా చేస్తున్నారు.. ఇవాళ ఉభయ గోదావరి జిల్లాల్లో నిర్వహించిన తనిఖీల్లో బయటపడ్డ సొమ్ముతో అధికారులు నోరు వెల్లబెట్టాల్సిన పరిస్థితి వచ్చింది.. తూర్పు గోదావరి జిల్లా కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద పోలీసుల తనిఖీల్లో పెద్ద ఎత్తున నగదు పట్టబడటం కలకలం సృష్టించింది. ట్రావెల్స్…
మోస్ట్ వాంటెడ్ ఘరానా దొంగను అరెస్ట్ చేశారు రాచకొండ పోలీసులు… హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో 43 ప్రాంతాల్లో చోరీకి పాల్పడినట్టు గుర్తించారు.. అతడే ముచ్చు అంబేద్కర్ అలియాస్ రాజు… అతడి వద్ద నుంచి కోటి 30 లక్షల విలువచేసే 230 తులాల బంగారు ఆభరణాలు, 10 కిలోల వెండి ఆభరణాలు, 18 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.. అయితే, ఏ రంగంలో రాణించాలన్నా కొన్ని మెలుకువలు అవసరం.. ఇక్కడ మన దొంగ గారి తెలివితేటలు…
మా పేర్లు శిలా ఫలకాలపై అవసరం లేదు.. ప్రజల మనుసుల్లో ఉన్నామని ధీమా వ్యక్తం చేశారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు.. నిన్న కొన్ని నాటకీయ పరిణామాలతో ఆయన అరెస్ట్ అయిన విషయం తెలిసిందే కాగా.. ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన.. పోలీసులు టీఆర్ఎస్కు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.. ఎమ్మెల్యే హోదాలో పర్యటిస్తే.. టీఆర్ఎస్ నేతలు అడ్డుకుంటే పోలీసులు చోద్యం చూశారని మండిపడ్డ ఆయన.. క్రిమినల్ బ్యాగ్రౌండ్ ఉన్న వారు నాపై భౌతికదాడులు చేసేందుకు యత్నించారని.. అదనపు…
చేసేది ఐటీ ఉద్యోగం.. కానీ ఆమె అమ్మేది మాత్రం మత్తుమందు. యువత ఈజీమనీ కోసం ఏ పనిచేయడానికైనా రెడీ అవుతున్నారు. యువకులు, ఐటీ నిపుణుల్లో గంజాయికి ఉన్న డిమాండ్‌ను సొమ్ము చేసుకొనేందుకు అరకు నుంచి సరకు తీసుకొచ్చి మల్కాజిగిరి, నాచారం, మేడ్చల్, పంజాగుట్ట, బంజారాహిల్స్ ప్రాంతాల్లో విక్రయిస్తుందో ఐటీ ఉద్యోగిని. ఆ యువతి ఆటకట్టించారు పోలీసులు. ఐటీ ఉద్యోగం చేస్తున్న కొండపనేని మాన్సీ.. గంజాయి అమ్ముతూ పట్టుబడ్డాడు. అతడిని బోయిన్పల్లి పోలీసులు మేడ్చల్ జిల్లా కొంపల్లిలో అరెస్ట్…
పోలీసులు ఎంత నిఘా పెట్టిన గుట్టుచప్పుడు కాకుండా డ్రగ్స్ దందా సాగుతూనే ఉంది.. ఇతర రాష్ట్రాలకు చెందినవారు.. విదేశాల నుంచి వచ్చిన వారు డ్రగ్స్‌తో సహా దొరికిపోయిన ఘటనలు అనేకం.. ఇక, డ్రగ్స్ కేసుల్లో ప్రముఖులను విచారించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే, హైదరాబాద్‌లో ఓ యువకుడు డ్రగ్స్‌తో మృతిచెందడం కలకలం సృష్టిస్తోంది.. గోవా వెళ్లిన హైదరాబాద్‌కు చెందిన బీటెక్ విద్యార్థి.. డ్రగ్స్ తీసుకున్నాడు… అలా డ్రగ్స్ కు అలవాటు పడిన సదరు విద్యార్థి ముందుగా అస్వస్థతకు…
తెలంగాణలో సంచలనం కలిగించిన వికారాబాద్ లో మైనర్ బాలికపై అత్యాచారం, హత్ కేసు కొలిక్కి వస్తోంది. తానే హత్య చేసినట్టు ప్రియుడు మహేందర్ (నాని) పోలీసుల విచారణలో ఒప్పుకున్నట్టు సమాచారం. హత్య జరిగిన రాత్రి స్నేహితులతో కలిసి మద్యం సేవించాడు యువకుడు. ఉదయం మూడు నుండి నాలుగు గంటల ప్రాంతంలో బయటకు రమ్మని బాలికకు ఫోన్ చేశాడు ప్రియుడు. ఊరి చివరన నిర్మాణుష్య ప్రాంతంలో కలుసుకున్నారు ఇద్దరు. శారీరకంగా కలవాలని బాలికను కోరాడు యువకుడు. అయితే ప్రతిఘటించింది…
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇవాళ నెల్లూరులో పర్యటించారు.. గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి రేణిగుంట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆయన.. అక్కడి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి నెల్లూరు పోలీసు కవాతు మైదానంలోని హెలిప్యాడ్‌కు చేరుకున్నారు.. ఆ తర్వాత రోడ్డు మార్గాన బయలుదేరి వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్‌కు చేరుకున్నారు.. అక్కడ మేకపాటి గౌతమ్‌రెడ్డి సంతాప సభలో పాల్గొన్నారు అనంతరం మళ్లీ తిరుగు ప్రయాణం అయ్యారు.. అయితే, సీఎం వైఎస్ జగన్.. నెల్లూరు జిల్లా పర్యటనలో భద్రతా…
ఒక రాష్ట్ర సీఎం భద్రత చాలా పకడ్బందీగా వుంటుంది. వుండాలి కూడా. కానీ స్వయాన ఒక ముఖ్యమంత్రిపై అగంతకుడు దాడిచేయడం కలకలం రేపుతోంది. సీఎం నితీష్ కుమార్ యాదవ్ కు చేదు అనుభం ఎదురైంది. పాట్నా సమీపంలోని భక్తియార్పూర్ వద్ద ఓ యువకుడు దాడికి పాల్పడ్డాడు. భద్రతను దాటుకుంటూ వెళ్లి దాడి చేయడంతో అంతా నిశ్చేష్టులయ్యారు. ఆ తర్వాత ఆ యువకుడిని సీఎం భద్రతా సిబ్బంది పట్టుకుని స్థానిక పోలీసులకు అప్పగించారు. భక్తియార్పూర్ మార్కెట్‌కు సమీపంలో భద్రతా…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జంతువుల వేటకు వెళ్లి విద్యుత్ షాక్ తో ఒకరు మరణించడం, మరొకరు ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపుతోంది. అడవి జంతువుల వేట వారి పాలిట మృత్యువు గా దాపురించింది. అడవి జంతువుల వేటకు వెళ్లి విద్యుత్ షాక్ తో ఒకరు మృతి చెందగా, ఆ మృతదేహం రెండు రోజులు అయినప్పటికీ లభించలేదు. పోలీసుల వేధింపులకు భయపడి మరో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనం సృష్టించింది. గత రెండు రోజుల నుంచి పోలీసులు…