Hyderabad Old City: ఇక్కడ ఇలాగే ఉంటుంది.. మరో ఎంఐఎం కార్పొరేటర్ హంగామా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్‌లో ఎంఐఎం కార్పొరేటర్లు హల్ చల్ చేస్తున్నారు.. భోలక్‌పూర్ కార్పొరేటర్ ఘటన మరువక ముందే… ఓల్డ్ సిటీలో మరో ఎంఐఎం కార్పొరేటర్ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారిపోయింది.. చార్మినార్ యునాని ఆసుపత్రి ముందు నో పార్కింగ్ ఏరియాలో.. తన వాహనాన్ని పార్క్ చేశాడు. మక్కా మసీదు ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ కావడంతో.. వెహికల్స్ పార్కింగ్ కోసం యునాని హాస్పిటల్ గేట్లు తెరిపించాడు కార్పొరేటర్ సయ్యద్ సొహైల్ ఖాద్రి.. అయితే, దీనిపై పోలీసులకు సమాచారం చేరవేశారు పోలీసులు.. డయల్ 100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు.. ఇక, ఫోన్ కాల్‌తో రంగంలోకి దిగారు ఎస్సై.. ఘటనా స్థలానికి చేరుకున్నారు.. అయితే, ఎస్సైతో వాగ్వాదానికి దిగాడు ఎంఐఎం కార్పొరేటర్.. ఎస్సైని పట్టుకుని నానా హంగామా చేశాడు.. అసలు మీకు ఇక్కడ ఏం పని.. ఎందుకొచ్చారంటూ నిప్పులు చెరిగాడు.. ఇక్కడ ఇలాగే చేస్తామంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగిన కార్పొరేటర్.
Read Also: Narayana Swamy: మళ్లీ మంత్రి కావాలనే ఆశ లేదు.. జగన్ నిర్ణయమే ఫైనల్..
Also Read
కాగా, ఈ తాజాగా ముషీరాబాద్‌లో పోలీసులపై దౌర్జన్యానికి పాల్పడిన భోలక్‌పూర్ ఎంఐఎం కార్పొరేటర్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.. మంగళవారం భోలక్‌పూర్‌లో అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ తెరిచి ఉంచడం.. షాపును క్లోజ్ చేయాలని పోలీసులు సూచించడంతో ఎంఐఎం కార్పొరేటర్ గౌస్ రెచ్చిపోయారు.. తన ఇలాకాలో పోలీసులు అడుగు పెట్టొద్దంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాకు ఎక్కి రచ్చ చేసింది… దీంతో మంత్రి కేటీఆర్ పోలీసులతో దురుసుగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ ట్విట్టర్ వేదికగా అధికారులను ఆదేశించడంతో.. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు.. ఐపీసీ 353, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేసిన విషయం విదితమే.. మరి ఎప్పుడు చార్మినార్ దగ్గర రచ్చ చేసిన కార్పొరేటర్ వ్యవహారంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి మరి… మరోవైపు.. హైదరాబాద్ పోలీసులపై హాట్ కామెంట్లు చేశారు హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ.. రేవ్ పార్టీ, డ్రగ్స్ కేసు వ్యవహారంపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆయన.. పబ్ నిర్వాహకుడిని అరెస్ట్ చేసి.. బడా బాబుల పిల్లలను వదిలిపెట్టారని ఆరోపించారు.. పెద్దలకు ఓ న్యాయం.. పేదలకు ఓ న్యాయమా? అంటూ నిలదీస్తూ.. మంత్రి కేటీఆర్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు ట్యాగ్ చేసిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
UIDAI App: ఆధార్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇంట్లో కూర్చునే నిమిషాల్లో మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవచ్చు! ఓ లుక్ వేయండి..
-
Su-57E Stealth Fighter: భారత్‌కు రష్యా Su-57E ఎందుకు అవసరం.? చైనా, పాక్‌కు చెక్..
-
Big Rain Alert: విజయవాడలో వర్ష బీభత్సం.. మునిగిపోయిన రోడ్లు, బ్రిడ్జిలు..
-
BRICS: భారత్‌కు దౌత్య విజయం.. ‘‘పహల్గామ్ ఉగ్రదాడి’’పై బ్రిక్స్ ఖండన..
-
Ponguleti Srinivas Reddy : భూభారతి వెనుక అసలు కథ ఇదే.. సభలో మంత్రి సంచలన ఆరోపణలు
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!