యాదాద్రి భువనగిరి జిల్లాలో పరువు హత్య కలకలం సృష్టిస్తోంది.. రెండు రోజుల క్రితం అదృశ్యమైన సస్పెన్షన్కు గురైన హోంగార్డు రామకృష్ణ మృతదేహమై కనిపించడంతో కుటుంబసభ్యులు షాక్ తిన్నారు.. అయితే, రామకృష్ణ ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకోవడమే ఈ హత్యకు కారణంగా తెలుస్తోంది… కొన్ని నెలల క్రితమే ప్రేమ వివాహం చేసుకున్న రామకృష్ణ.. రెండు రోజుల నుంచి కనిపించకుండా పోయాడు.. అయితే, రామకృష్ణని ఎవరో కిడ్నాప్ చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు కుటుంబ సభ్యులు.. Read…
హైదరాబాద్ పాతబస్తీలో మరోసారి స్ట్రీట్ ఫైట్ వ్యవహారం కలకలం సృష్టించింది… ఈ సారి ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మొఘల్పురా పోలీస్ స్టేషన్ పరిధిలోని అంధేరి గల్లీలో మసీదు నుంచి తిరిగి వెళ్తున్న ఇద్దరు యువకుల మధ్య ఘర్షణ జరిగింది.. ఈ ఘర్షణలో 15 ఏళ్ల నవాజ్ అహ్మద్ అనే యువకుడు మృతి చెందాడు… స్థానికుల ఫిర్యాదుతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టారు.. ఇక, యువకుడి…
టెక్నాలజీ ఎంత పెరిగినా ఇంకా మూఢనమ్మకాలు మాత్రం వీడడం లేదు. కర్నూలు జిల్లాలో శ్రీశైలం తర్వాత ప్రముఖ పుణ్యక్షేత్రం మంత్రాలయంలో క్షుద్రపూజలు కలకలం రేపుతున్నాయి. మంత్రాలయం మండలం కల్దేదేవకుంట సహకారసంఘం కార్యాలయంలో క్షుద్రపూజలు జరిగాయన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. తోటి సిబ్బందిపై సహకారసంఘం సీఈవో వెంకటేశ్ చేతబడి చేయించారని సిబ్బంది ఆరోపించారు. దీంతో సీఈవో వెంకటేశ్ పై సిబ్బంది బంధువులు దాడికి పాల్పడ్డారు. Read Also: Beeda Ravichandra: మంత్రుల డ్యూటీ విపక్షాన్ని తిట్టడమేనా? దీంతో పోలీసులు…
సాధారణంగా భార్యను భర్తలు హత్య చేసిన ఘటనలు ఎక్కువగా చూస్తుంటాం.. కానీ, పరిస్థితులు మారిపోయాయి.. భార్తలే భర్తలను దారుణంగా హత్య చేసిన ఘటనలు కూడా వెలుగు చూస్తున్నాయి.. జనగామ జిల్లాలో భర్తను దారుణంగా చంపింది భార్య. తండ్రి, మైనర్ కొడుకుతో కలిసి భర్త కళ్లల్లో కారం కొట్టి కత్తితో దాడిచేసింది. ఈ ఘటనలో భర్త అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. హైదరాబాద్లోని పార్షిగుట్టకు చెందిన హనుమాండ్ల వినోద్, జనగామలోని అంబేద్కర్ నగర్లో నివాసముంటున్న మంజులను రెండేళ్ల క్రితం రెండో…
కరోనా మహమ్మారి శ్రీవారిని దర్శన విదానాన్ని కూడా మార్చేసింది.. ప్రత్యేక దర్శనం అయినా.. సర్వదర్శనం అయినా టికెట్లు తప్పనిసరి చేసింది టీటీడీ… కోవిడ్ నిబంధనలు పాటిస్తూ శ్రీవారిని దర్శనం కల్పించేందుకు వీలుగా.. ఆన్లైన్లో కోటా పెట్టి దర్శనం కల్పిస్తూ వస్తోంది.. శ్రీవారి సర్వదర్శన టికెట్లకు భారీ డిమాండ్ ఏర్పడింది.. సర్వదర్శనం టికెట్లు ఇచ్చే క్యూ లైన్ వద్దకు భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు.. వేలాది మంది ఒక్కసారిగా రావడంతో తోపులాట జరిగింది.. ఓ దశలో తొక్కిసలాట కూడా…
ప్రజల అవసరాలను క్యాష్ చేసుకుంటున్నారు వడ్డీ వ్యాపారులు.. అక్రమంగా వడ్డీ వ్యాపారం నిర్వహిస్తూ.. అధిక మొత్తంలో వడ్డీలు వసూలు చేస్తున్నారు.. ఇక, మహబూబాబాద్ జిల్లాలో అక్రమ వడ్డీ వ్యాపారులపై ఉక్కుపాదం మోపారు అధికారులు. మహబూబాబాద్, గార్ల, డోర్నకల్, కేసముద్రం మండలాల పరిధిలో చిట్టీ వ్యాపారులు, చిట్ ఫండ్స్ ఆగడాలు శృతి మించాయి. దీంతో జిల్లా ఎస్పీ శరత్ చంద్రపవార్ నేతృత్వంలో పోలీసులు 22 బృందాలుగా విడిపోయి దాడులు చేశారు. కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. కొంతకాలంగా మహబూబాబాద్…
హైదరాబాద్లో ఎంఐఎం కార్పొరేటర్లు హల్ చల్ చేస్తున్నారు.. భోలక్పూర్ కార్పొరేటర్ ఘటన మరువక ముందే… ఓల్డ్ సిటీలో మరో ఎంఐఎం కార్పొరేటర్ వ్యవహారం హాట్ టాపిక్గా మారిపోయింది.. చార్మినార్ యునాని ఆసుపత్రి ముందు నో పార్కింగ్ ఏరియాలో.. తన వాహనాన్ని పార్క్ చేశాడు. మక్కా మసీదు ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ కావడంతో.. వెహికల్స్ పార్కింగ్ కోసం యునాని హాస్పిటల్ గేట్లు తెరిపించాడు కార్పొరేటర్ సయ్యద్ సొహైల్ ఖాద్రి.. అయితే, దీనిపై పోలీసులకు సమాచారం చేరవేశారు పోలీసులు.. డయల్…
కాంగ్రెస్ పార్టీ పోరు బాట పడుతోంది.. తెలంగాణలో పెరిగిన విద్యుత్ చార్జీలను నిరసిస్తూ కాంగ్రెస్ ఆందోళనకు పిలుపు నిచ్చింది. నెక్లెస్ రోడ్డులోని ఇందిరా గాంధీ విగ్రహం నుండి ర్యాలీ చేపట్టి, విద్యుత్ సౌధ ముట్టదించాలని నిర్ణయించింది. ఉదయం 10.30 నిమిషాలకు పార్టీ నాయకులు అంతా ఇందిరా గాంధీ విగ్రహం వరకు చేరుకోనున్నారు. అక్కడి నుండి విద్యుత్ సౌధ ముట్టడికి వెళ్తారు. పార్టీ ముఖ్య నాయకులు అంతా ఈ ముట్టడిలో పాల్గొనాలని పీసీసీ ఆదేశించింది. జిల్లాల వారిగా కూడా…
పోలీసులు ఎంతగా ప్రయత్నించినా నేరాలు అదుపులోకి రావడం లేదు. టెంపుల్ సిటీ తిరుపతి జిల్లా ఏర్పాటు జరిగిన రోజే…..లా అండ్ ఆర్డర్ అదుపు తప్పింది. నూతనంగా తిరుపతి పట్టణంలో కలెక్టర్,ఎస్పీలు బాధ్యతలు స్వీకరించిన రోజే మందు బాబులు రెచ్చిపోయారు. పట్టపగలు అందరూ చూస్తూ వుండగానే తెగబడ్డారు. సాక్షాత్తు భద్రతను పర్యవేక్షించవలసిన పోలిసులు ప్రేక్షక పాత్ర పోషించారు. మద్యం మత్తులో ముగ్గురు కలసి ఒక యువకుడిని చితకబాదారు. అందరు అయ్యో పాపం వదిలెయ్యండి అని అంటున్నా వాళ్ళు పట్టించుకోలేదు.…
ఉగాది రోజు జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఏకంగా 11 మంది ప్రాణాలను తీసింది.. తమిళనాడులో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తిరుపత్తూరు వద్ద ఓ ట్రక్కు 100 అడుగుల లోయలో పడిపోయిన ఘటనలో అక్కడికక్కడే 11 మంది మృతిచెందారు.. మరో 20 మంది తీవ్రగాయాలపాలయ్యారు.. మృతులంతా పులియూరు గ్రామానికి చెందినవారిగా గుర్తించారు.. తిరుపత్తూరు జిల్లాలోని సెంబరై ఆలయ దర్శనానికి బయల్దేరి వెళ్తుండగా.. ట్రక్కు ప్రమాదానికి గురైంది.. ఈ సమయంలో ట్రక్కులో 30 మందికి పైగా ఉన్నట్టుగా…