11 మంది కార్మికులు సజీవదహనం అయిన బోయిగూడ అగ్నిప్రమాదంపై పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు వెలుగుచూస్తున్నాయి.. ప్రమాద ఘటనను త్రీడీ స్కనర్తో పరిశీలించాయి క్లూస్ టీమ్స్.. 11 మంది కార్మికులు సజీవ దహనం అయిన కేసులో దర్యాప్తు ముమ్మరం చేశాయి.. ఇప్పటికే పలు కీలక ఆధారాలు సేకరించారు ఫైర్ సేఫ్టీ అధికారులు మరియు క్లూస్ టీమ్స్.. షార్ట్ సర్క్యూట్‌తో ఎగిసిపడిన నిప్పు రవ్వల కారణంగా.. అగ్ని ప్రమాదం జరిగినట్టు అంచనా వేస్తున్నారు.. దీంతో స్క్రాప్ గోదాంలో మంటల…
కట్టుకున్న భార్యకు అన్నీ తానై చూసుకోవాల్సిన భర్త సైకో ప్రవర్తనతో.. ఓ ఇల్లాలికి నరకం చూపించాడు.. పెళ్లి జరిగినప్పటి నుంచి వికృత వేధింపులకు పాల్పడ్డాడు.. మౌనంగా దాదాపు రెండేళ్లు ఆ సైకోగాడిని భరించిన ఆమె.. చివరకు పోలీసులను ఆశ్రయించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది… పూర్తి వివరాల్లోకి వెళ్తే.. శ్రీకాళహస్తికి చెందిన పోలయ్య 2020 మార్చి 5వ తేదీన వివాహం చేసుకున్నాడు.. ఇక, కొంతకాలం నుంచి తీవ్ర వేధింపులకు దిగాడు.. ఓ వైపు అనుమానం, వికృత వేధింపులు.…
రేపు ఐపీఎల్-15 వ సీజన్ ప్రారంభం కానుంది. ముంబై వాంఖడే స్టేడియం వేదికగా చెన్నై-కోల్‌కతా మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే ఉగ్రవాదులు ఈ ఏడాది ఐపీఎల్ మ్యాచ్‌లను టార్గెట్ చేసినట్లు సమాచారం. క్విక్ రెస్పాన్స్ బాంబ్ స్వ్కాడ్ టీం ఇచ్చిన హెచ్చరికలతో మహారాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కొందరు ఉగ్రవాదులు మారువేశంలో మ్యాచ్‌లు జరగనున్న స్టేడియాల వద్ద రెక్కీ నిర్వహించినట్లు తెలుస్తోంది. దీంతో స్టేడియాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వ నిర్ణయించింది. మరోవైపు, ఐపీఎల్…
హైదరాబాద్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది.. బోయిగూడలోని ఓ స్క్రాప్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 11 మంది కార్మికులు సజీవదహనం అయ్యారు.. ఇవాళ తెల్లవారుజామను స్క్రాప్ గోదాంలో అగ్నిప్రమాదం జరిగింది.. అందులో పనిచేస్తున్న కార్మికులు మంటల్లో చిక్కుకుపోయారు.. ఇద్దరు కార్మికులను ఫైర్ సిబ్బంది కాపాడారు.. ఇక, స్క్రాప్ గోదాం పక్కనే టింబర్ డిపోలు ఉన్నాయి.. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన ఎనిమిది ఫైర్ ఇంజన్లు.. మంటలను అదుపుచేశాయి.. కానీ, అప్పటికే 11 మంది…
బోధన్ ఇష్యూ ఇప్పుడు చర్చగా మారింది.. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. బంద్ వరకు వెళ్లింది పరిస్థితి.. దీంతో 144 సెక్షన్ విధించిన పోలీసులు.. స్థానికేతరులను ఎవ్వరినీ బోధన్‌లోకి రానివ్వకుండా ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు పెట్టి.. తనిఖీలు చేస్తున్నారు.. అయితే, బోధన్ అల్లర్ల వెనుక సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.. ఆ అల్లర్ల వెనుక కుట్ర కోణం ఉందని తేల్చారు పోలీసులు.. శివసేనకు చెందిన గోపి అనే వ్యక్తి హస్తం ఉన్నట్టుగా గుర్తించారు. Read Also: Muralidhar Rao: తెలంగాణ…
కరీంనగర్ జిల్లా శాతవాహన యూనివర్సిటీలో అగ్ని ప్రమాదం జరిగింది. యూనివర్సిటీ ఆవరణలోని చెట్లు పొదల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అధికారులు అప్రమత్తమై ఫైర్ అధికారులకు సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మూడు ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకరావడానికి ప్రయత్నించారు. ప్రమాదం కారణంగా యూనివర్శిటీలో పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయి మంటలు. బాయ్స్ హాస్టల్ సమీపం నుంచి ఎంబీఏ కాలేజీ ఆవరణం వరకూ విస్తరించాయి మంటలు. శాతవాహన యూనివర్సిటీ లో ఉన్న…
కామాంధులు కన్నుమిన్ను ఎరగకుండా దారుణాలకు ఒడిగడుతూనే ఉన్నారు.. ఇలాంటి ఘటనలపై కేసులు నమోదు చేస్తున్నా.. కఠిన శిక్షలు అమలు చేస్తున్నా… నిత్యం ఏదో ఒక చోట మాత్రం అత్యాచార ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి.. తాజాగా, ఓ దుర్మార్గుడు.. ఓ మహిళపై కన్నేశాడు.. పొలాల్లోకి లాక్కెళ్లి.. అత్యాచారం యత్నం చేశాడు.. ఇక, మహిళ గట్టిగా కేకలు వేయడంతో.. మహిళను కాపాడేందుకు వెళ్లాడు.. ఆమె భర్త.. దీంతో.. బాధితురాలి భర్తపై దాడి చేసిన నిందితుడు.. అతడిని తీవ్రంగా గాయపర్చి.. అక్కడి…
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో రాత్రి కారు బీభత్సం సృష్టించింది. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి వైపు నుంచి జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 1 వైపు వెళ్తున్న మహేంద్ర థార్ కారు.. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లో బ్రిడ్జి దిగి కొంతదూరం వెళ్లగానే రోడ్డు దాటుతున్న యాచకులను ఢీకొట్టింది. దీంతో ఓ మహిళ చేతిలో ఉన్న రెండున్నరేళ్ల బాలుడు కిందపడిపోయింది.. తలకి తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే ఆ బాలుడు కన్నుమూశారు.. ఈ ప్రమాదంలో మహిళ కూడా తీవ్రంగా గాయపడింది..…
తెలంగాణ ట్రాఫిక్ పోలీసుల ఒక్క ఐడియా.. ఇప్పుడు కోట్లు కుమ్మరిస్తోంది.. వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్లను వసూలు చేసేందుకు తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు తీసుకొచ్చిన డిస్కౌంట్ ఆఫర్‌కు అనూహ్యంగా స్పందన వస్తోంది.. చలాన్లు కట్టేందుకు వాహనదారులు పోటీ పడడంతో.. కొన్నిసార్లు సర్వర్ మొరాయించిన సందర్భాలు కూడా ఉన్నాయంటే.. వాహనదారులు ఏ స్థాయిలో పెండింగ్ చలాన్లు క్లియర్ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.. ఇక, దీనికి సంబంధించిన తాజా డేటాను విడుదల చేశారు ట్రాఫిక్ పోలీసులు.. ఈ నెల 1వ…
హోలీ వేడుకలతో జంటనగరాల పరిధిలో పోలీసులు 48 గంటల పాటు ఆంక్షలు విధించారు. హైదరాబాద్ పరిధిలో హోలీ రోజు మద్యం దుకాణాలు, బార్లు, క్లబ్బులు మూసివేయాలని ఆదేశించారు. ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 6 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు. నగరంలోని బహిరంగ ప్రదేశాల్లో హోలీ వేడుకలపై నిషేధం విధించారు. అపరిచిత వ్యక్తులు, వాహనాలు, భవనాలపై రంగులు పోయడం చేయకూడదని స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని…