ఇంటర్నెట్ లోనే కాదు బహిరంగ ప్రదేశాల్లోనూ అశ్లీలత పెచ్చుమీరుతోంది. ఆపాల్సిన పోలీసులు దగ్గరుండి అశ్లీల డ్యాన్స్ లు వేయించడం వివాదాలకు దారితీసింది. అమ్యామ్యాలు పుచ్చుకొని చేజర్ల పోలీసులు చూసీచూడనట్టు వ్యవహరించారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. నెల్లూరు జిల్లా చేజర్ల మండలం ఆదూరుపల్లి గ్రామంలో అర్థరాత్రి వేళ చేజర్ల పోలీసుల సాక్షిగా అశ్లీల నృత్యాలు ప్రదర్శించారు. శ్రీ రామ నవమి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన సంబరాల్లో ఈ అశ్లీల నృత్యాలు రాజ్యమేలాయి.
పోలీసులు ప్రభుత్వ ఆంక్షలని సైతం తుంగలో తొక్కి.. స్వేచ్చగా.. అశ్లీల నృత్యాలను ప్రదర్శించడంపై గ్రామస్థులు మండిపడుతున్నారు. ఓ వైపు అసాంఘిక కార్యకలాపాలు జరిగితే ఉక్కుపాదం మోపుతామంటున్న పోలీసులు, అమ్యామ్యాలు దండిగా అందుకొని , గ్రామస్థులు ఎవరు అడ్డుకోకుండా దగ్గరుండి మరి స్టెప్పులు వేయించారు. అశ్లీలతను ఆపాల్సిన పోలీసులే యాంకర్ కి, డ్యాన్సర్లకు ఊపివ్వడంతో వారు రెచ్చిపోయి చిందేశారు. దీంతో గ్రామస్థులు తిరునాళ్ళలో ఇలాంటి పాడుపనులేంటి…అంటూ నిర్వహకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read Also:Kadapa RIMS: చిచ్చురేపిన సీల్.. ఛాంబర్‌కు తాళాలు