మావోయిస్టులు మళ్లీ పంజా విసురుతున్నారు.. వరుసగా దాడులకు దిగుతున్నారు.. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో దాడులకు పాల్పడుతున్నారు.. ఇన్న బీజాపూర్ జిల్లాలోని కుత్రు పోలీసు స్టేషన్ పరిధిలోని ధర్బా దగ్గర పోలీసు క్యాంపుపై మెరుపుదాడికి పాల్పడ్డ మావోయిస్టులు.. ఇవాళ బర్సూర్ పోలీస్ స్టేషన్ సమీపంలోని మంగనార్ గ్రామంలో పీఎంజీఎస్‌వై రోడ్డు నిర్మాణంలో నిమగ్నమైన ఏడు ట్రాక్టర్లను తగలబెట్టారు. ఈ ఘటనకు మావోయిస్టు ఈస్ట్ బస్తర్ డివిజన్ కమిటీ చేసింది. స్థానికుల చెబుతున్న వివరాల ప్రకారం.. మహిళలతో సహా 100 నుంచి 150 మంది సాయుధ మావోయిస్టులు భారీ, ఆధునిక ఆయుధాలతో గ్రామాన్ని చుట్టుముట్టి స్థానిక గ్రామ పంచాయతీ భవనం ముందు ఆగి ఉన్న వాహనాలకు నిప్పు పెట్టారు. రోడ్డు పనులు నిలిపివేయాలంటూ గ్రామ సర్పంచ్, కార్యదర్శి, కాంట్రాక్టర్ సంతోష్ పాతారకు హెచ్చరిస్తూ బ్యానర్ కట్టారు.
Read Also: COVID 19: భారత్‌లో మళ్లీ తగ్గిన కరోనా కేసులు
కాగా, సోమవారం కుత్రు పోలీస్ స్టేషన్ పరిధిలోని దర్భా పోలీస్ క్యాంపుపై సాయుధ నక్సల్స్ పెద్ద సమూహం కాల్పులు జరిపింది. నక్సల్స్‌పై ఎదురుకాల్పులు జరిపిన భద్రతా బలగాలు వారిని ప్రతిఘటించారు.. ఈ ఘటనలో నలుగురు పోలీసులు గాయపడ్డారు. గాయపడిన ఇద్దరు పోలీసులను రాయ్‌పూర్‌కు తరలించగా, మరో ఇద్దరు బీజాపూర్ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. ఇది ఇలా ఉంటే తమపై వైమానిక దాడులకు పాల్పడుతున్నారని మావోయిస్టులు చేసిన ఆరోపణలను బస్తర్ ఐజీ సుందర్‌రాజన్ తోసిపుచ్చారు. ఛత్తీస్‌గఢ్ పోలీసులపై మావోయిస్టు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్ దక్షిణ బస్తర్‌లోని అడవులు గ్రామాలపై డ్రోన్‌ల సహాయంతో ఏరియల్ బాంబు దాడికి పాల్పడ్డారని ఆరోపణలను బస్తర్ ఐజీ కొట్టిపారేశారు.. ఇలాంటి నిరాధార ఆరోపణలు ఆ ప్రాంత ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే అని విమర్శించారు.