Delhi Crime: లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన ఇద్దరు ముష్కరులు అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఇద్దరు షార్ప్ షూటర్లను అరెస్ట్ చేశారు. అరెస్టయిన ముష్కరులలో దీపాంశు అలియాస్ మోను, మొయినుద్దీన్ అలియాస్ సల్మాన్ ఉన్నారు. వీరిద్దరూ సల్మాన్ త్యాగి గ్యాంగ్‌కు చెందినవారు కాగా.. సల్మాన్ త్యాగికి గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో సంబంధం ఉంది. దుండగులిద్దరూ ఈనెల 19న రాత్రి రాజౌరి గార్డెన్ ప్రాంతంలోని రెండు వేర్వేరు చోట్ల వ్యాపారుల దుకాణాలపై కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోయారు.
Tata Punch EV: టాటా పంచ్ ఈవీ వచ్చేస్తోంది.. వచ్చే నెలలో లాంచ్ అయ్యే ఛాన్స్..
Also Read
క్రైమ్ బ్రాంచ్ స్పెషల్ సీపీ రవీంద్ర యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం.. కాల్పులకు ముందు వ్యాపారవేత్తలిద్దరికీ వర్చువల్ కాల్ ద్వారా రేడింపియేషన్ (విమోచన) కాల్ వచ్చింది. ఒక్కొక్కరు రూ.50 లక్షలు డబ్బులు చెల్లించాలని ఇద్దరు వ్యాపారుల నుంచి డిమాండ్ చేశారు. అయితే వారు డబ్బులు ఇవ్వకపోవడంతో వారి దుకాణాలపై కాల్పులు జరిపారు. ఈ కేసును ఛేదించేందుకు క్రైం బ్రాంచ్ ఘటనా స్థలం చుట్టూ అమర్చిన సీసీటీవీ కెమెరాలను పరిశీలించింది. దాని ద్వారా ఇద్దరు దుండగులను గుర్తించారు. అనంతరం వారి కోసం వెతకగా.. దీపాంశు అకా మోను అనే వ్యక్తి పట్టుబడ్డాడు. అతని నుండి 2 పిస్టల్స్ స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత అతన్ని విచారించగా కీలక విషయాలు బయటపడ్డాయి.
Botsa Satyanarayana : 8 వేలకు పైగా టీచర్ పోస్టులు భర్తీ చేస్తాం.
సల్మాన్ త్యాగిని కలిసేందుకు తరచూ జైలుకు వెళ్లేవారని విచారణలో వారు చెప్పారు. అంతేకాకుండా తమను సల్మాన్ త్యాగి తన గ్యాంగ్‌లో చేర్చుకున్నాడని తెలిపారు. ఆయుధాలు ఎక్కడ దొరుకుతాయో, ఎక్కడ బుల్లెట్లు దొరుకుతాయోనని జైలు లోపల నుంచి వారికి సమాచారం అందించేవాడు. ఆ తర్వాత సల్మాన్ త్యాగి సూచనల మేరకు వారిద్దరూ ఈ నేరానికి పాల్పడ్డారు. వాస్తవానికి వారు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌లో చేరాల్సి ఉందని చెప్పారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరు పెరగడంతో.. స్థానిక నేరస్థులు, మైనర్ అబ్బాయిలు లారెన్స్ గ్యాంగ్‌లో చేరడం ప్రారంభించారు. సల్మాన్ త్యాగి కూడా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో చేతులు కలిపారు.
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!