భువనగిరి జిల్లాలో కల్తీపాలు తయారు చేస్తున్న గృహాలపై పోలీసులు దాడి చేసి తయారీకి వాడే పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం కనుముక్కుల, భీమనపల్లి గ్రామాల్లో ఇవాళ (బుధవారం) ఈ ఘటన వెలుగులో వచ్చింది. స్థానిక ఎస్‌ఐ విక్రమ్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. భీమనపల్లి గ్రామానికి చెందిన కప్పల రవి కల్తీ పాలను విక్రయిస్తున్నారని విశ్వసనీయ సమాచారంతో పోలీసులు రవి ఇంటిని తనిఖీలు చేశారు.
Read Also: Donald Trump: డొనాల్డ్ ట్రంప్ చనిపోయాడు.. కలకలం రేపిన ట్రంప్ కుమారుడి పోస్ట్!
భీమనపల్లి, కనుముకుల గ్రామాలలో కల్తీ పాలు తయారు చేస్తూ.. వ్యాపారం చేస్తున్నారన్న సమాచారంతో ఎస్ఓటీ పోలీసులు కల్తీ పాల కేంద్రాలపై ఏక కాలంలో సోదాలు చేసి కల్తీ పాలు తయారు చేస్తున్న కప్పల రవి, కుంభం రఘులను అదుపులోకి తీసుకొని వారి దగ్గర నుంచి 450 లీటర్ల కల్తీ పాలు, 300 ఎంఎల్ హైడ్రోజన్ పెరాక్సైడ్, 4 డోలోఫర్ స్కిమ్డ్ మిల్క్ పౌడర్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. దీంతో నిందితులను ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని ఎస్ఐ విక్రమ్ రెడ్డి అన్నారు. కల్తీ పాలను పరీక్షల నిమిత్తం ల్యాబరేటరీకి పంపించామని.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ విక్రమ్ రెడ్డి పేర్కొన్నారు.
Read Also: Neuralink: మెదడులో చిప్ పెట్టడానికి సిద్ధమవుతున్న ఎలాన్ మస్క్..