Thummala Nageswara Rao: 6 గ్యారెంటీలకంటే నేను ఇంకో పధకం ఇస్తున్న అదే ప్రశాంతమైన ఖమ్మం అని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఒకప్పుడు ఈ కాలనీ నుంచి అర్ధరాత్రి కూడా నీళ్లకోసం ఫోన్ లు వచ్చేవన్నారు.
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో కల్తీ చాక్లెట్స్ తయారీ చేస్తున్న కేటుగాళ్లు గుట్టు బయట పడింది. హైదర్ గూడలో సుప్రజా ఫుడ్స్ పేరుతో కల్తీ దందా చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. అనూస్ ఇమ్లీ, క్యాడీ జెల్లి పేరుతో చాక్లెట్స్ తయారీ చేస్తున్నారు.
తిరుపతి జిల్లాలో అనేక చోట్ల బైక్, ఇళ్ళల్లో దొంగతనాలకు పాల్పడుతున్నా.. ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి వారి దగ్గర నుంచి నలభై లక్షల రూపాయల చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు
ప్రపంచ కప్లో భాగంగా.. ఈరోజు భారత్-దక్షిణాఫ్రికా మధ్య ఈడెన్ గార్డెన్స్‌లో మ్యాచ్ జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్కు ముందు టిక్కెట్ల అమ్మకాలు గోల్ మాల్ అయ్యాయి. టిక్కెట్లను బ్లాక్ మార్కెటింగ్ చేశారన్న ఆరోపణల నేపథ్యంలో కోల్‌కతా పోలీసులు బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీకి నోటీసులు పంపించారు.
చిత్తూరు నగరంలో సినీ ఫక్కీలో చోరీ జరిగింది. శేషాపీరాన్ వీధిలోని కీర్తనా గోల్డ్ లోన్ కంపనీకి చెందిన సుమారు 22 లక్షల బంగారును కేటుగాళ్లు కొట్టేశారు. కంపెనీ నుంచి స్ట్రాంగ్ రూంకు రీజినల్ మేనేజర్ జాన్ బాబు బంగారు నగలను తరలించే క్రమంలో దుండగులు ఈ చోరీ చేశారు.
పింగళి వెంకయ్య మనవడు గోపి కృష్ణ భార్యపై గుర్తుతెలియని వ్యక్తి కత్తితో దాడి చేశాడు. మల్కాజిగిరి డీఏపీ స్కూల్లో సునీత టీచర్గా పని చేస్తుంది. ఈ క్రమంలో నిన్న సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత లిఫ్ట్ దగ్గర ఓ వ్యక్తి కత్తితో దాడి చేయడంతో.. వెంటనే స్థానికులు స్పందించి దాడి చేసిన వ్యక్తిని పట్టుకుని చితకబాది నేరేడ్మెట్ పోలీసులకు అప్పగించారు.
ఇప్పటికే కొనసాగుతున్న కర్ఫ్యూ లో సడలింపు ఇవ్వాలని గతంలో నిర్ణయించారు. కానీ బుధవారం చోటు చేసుకున్న పరిస్థితుల కారణంగా ఆ నిర్ణయాన్ని మార్చుకుని మళ్ళీ కర్ఫ్యూని విధించారు.
Student Vaibhav: నగరంలోని జిల్లెలగూడలో మంగళవారం ఇంటర్ విద్యార్థి వైభవ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాలేజీ యాజమాన్యం వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నానని ఆత్మహత్యకు ముందు వైభవ్ సూసైడ్ నోట్ రాశాడు.