ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు డలంలోని దుగ్గిరాలపాడు గ్రామంలో 5 కోట్ల రూపాయల మేరకు కుచ్చు టోపీ పెట్టారు. హైదరాబాద్ లో రాథారాం మార్కెటింగ్ కంపెనీ బోర్డ్ తిప్పేసింది. ఇరు రాష్ట్రాల్లో సుమారు 2 వేల కోట్ల రూపాయల వరకు వసూలు చేసి ఉంటారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Gold Shop Robbery: వండుకోకుండానే వంటకాలాన్ని కంచం లోకి రావాలి అనుకున్నట్టు ఒళ్ళు వంచకుండానే డబ్బులు రావాలి అనుకున్నాడు ఓ యువకుడు. స్విగ్గి, జొమాటోలో ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నంత సులువుగా డబ్బులు సంపాదించుకోవాలి అనుకున్నాడు. అందుకోసం తగిన ప్లాన్ వేసాడు. ఓ రోజంతా బంగారం షాప్ లో బొమ్మల నిలుచున్నాడు. షాప్ మూసేసాక చేతి వాటం చూపించాడు. అయితే ఏ చోటి కర్మ ఆ చోటే అన్నట్టు బంగారం షాప్ లో చేసిన పని బట్టల షాప్…
ఇబ్రహీంపట్నం డబుల్ మర్డర్ కేసులో రంగారెడ్డి జిల్లా కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 2022 మార్చ్ ఒకటో తేదీన శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డిలనే రియల్టర్లపై కాల్పులు జరపడంతో ఇద్దరు మృతి చెందారు. ముగ్గురు నిందితులకు జీవిత ఖైదు శిక్షను రంగారెడ్డి జిల్లా కోర్టు విధించింది.
భుత్వ పదవులు ఇప్పిస్తానంటూ కోట్ల రూపాయలు వసూలు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, నిందితుడు విశ్వతేజగా పోలీసులు గుర్తించారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ బంగారపు షాపు యజమాని దగ్గర, రాజ్యసభ సీటు ఇప్పిస్తానని చెప్పి కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కేంద్రం ఇప్పటికే ఉన్న నాలుగు రాష్ట్రపతి శౌర్య పతకాలను తక్షణమే అమల్లోకి వచ్చేలా ఒకే పతకంగా విలీనం చేసింది. ఇప్పుడు అది 'ప్రెసిడెంట్స్ మెడల్ ఫర్ గ్యాలంటరీ'గా పిలవబడుతుంది.
దీపావళి పండుగ దగ్గర పడుతుండడంతో పెద్ద ఎత్తున బాణాసంచాలను తయారు చేసి, నిల్వ ఉంచారు. ఇవాళ మధ్యాహ్నం ఆ షాపులో బాణాసంచా కొనుగోలు చేసిన కొందరు ఆ షాపు ముందే వాటిని కాల్చి వేశారు. దీంతో అనుకోకుండా ఓ ఫైర్ క్రాకర్ మండుతూ ఆ షాపులోకి దూసుకుపోయింది. దాంతో, ఒక్కసారిగా అందులోని బాణాసంచా పెద్ద ఎత్తున పేలింది. గంటకు పైగా, ఈ పేలుళ్లు కొనసాగినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు.
Hyderabad: కుటుంబ కలహాలు జీవితాలను విచ్ఛిన్నం చేస్తున్నాయి. అన్యోన్యంగా ఉండే జీవితాల్లో చిన్న చిన్న గొడవలకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దాన్ని ప్రభావం పిల్లలపై పడుతుందనే ఆలోచన లేకుండా పోతుంది.