సెంట్రల్ అమెరికాలోని పెన్సిల్వేనియా సమీపంలో గురువారం ఓ చిన్న విమానం కూలిపోయింది. విమానం కూలిన ఘటనలో ఎంత మంది గాయపడ్డారనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. పశ్చిమ కలాన్‌లో మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో విమానం కూలిపోయిందని పోలీసు అధికారి తెలిపారు. కోట్స్‌విల్లేలోని చెస్టర్ కౌంటీ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే విమానం కూలిపోయిందని వారు తెలిపారు. విమానంలో ఒక్క పైలట్ మాత్రమే ఉన్నారని చెప్పారు.
Read Also: Budget 2024: క్రీడల బడ్జెట్.. గతేడాది కంటే రూ.45.36 కోట్లు ఎక్కువ!
అయితే, ప్రమాదం సమయంలో విమానం చెట్లు, ఇళ్లను ఢీకొని నేలపై పడిపోయింది అని పోలీస్ అధికారులు తెలియజేశారు. ఇక, ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి నష్టం జరగలేదు. అలాగే ఎవరికీ గాయాలు కాలేదని వెల్లడించారు. అదే సమయంలో ప్రమాదానికి గల కారణాలేమిటనేది ఇంకా తెలియరాలేదు. దీనిపై విచారణ కొనసాగుతోందని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. విచారణ తర్వాతే అసలు విషయం తెలియజేస్తామని పేర్కొన్నారు. అయితే, అమెరికాకు చెందిన విమానాలు తరుచు ప్రమాదాల బారిన పడుతున్నాయి.