Allu Arjun: అభిమానుల కోసం బన్నీ స్పెషల్ గిఫ్ట్.. 900 మందికి ఊహించని సర్ప్రైజ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Allu Arjun: ఈ రోజు హైదరాబాద్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నిర్వహించిన ఫ్యాన్స్ మీట్ ఘనంగా జరిగింది. ఈ ప్రత్యేక కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ రాష్ట్రాల నుంచి దాదాపు 900 మంది బన్నీ అభిమానులు హాజరయ్యారు. ఈ ఫ్యాన్స్ మీట్లో ప్రతి ఒక్క అభిమాని కోసం ప్రత్యేకంగా బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ కోడ్‌ను ఏర్పాటు చేశారు. అభిమానులపై తనకున్న ప్రేమను మరోసారి చాటుకున్న అల్లు అర్జున్.. AAFA (అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్) తరఫున 900 మంది అభిమానులకు ఇన్సూరెన్స్ పాలసీలను అందించినట్లు సమాచారం.
అంతేకాకుండా ప్రతి అభిమానితో వ్యక్తిగతంగా ఫొటోలు దిగిన బన్నీ, దాదాపు ఆరు గంటల పాటు వేదికపైనే ఉండి అభిమానులతో గడిపారు. అభిమానులతో తన అనుబంధాన్ని పంచుకుంటూ వారిని ఉత్సాహపరిచారు. ఇకపై ప్రతి ఆరు నెలలకు ఒకసారి అభిమానులతో ప్రత్యేకంగా ఫ్యాన్స్ మీట్ నిర్వహించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ చూపించిన ఈ అభిమానం పట్ల ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ వేదికపై నుంచి బన్నీ మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియలో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అభిమాన సంఘాన్ని ఏర్పాటు చేసి ఇంత ప్రేమ, ఆదరణ చూపిస్తున్న ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు చెప్పలేకపోయినా, వారందరూ తన మనసులో ఉన్నారని అన్నారు. ఫ్యాన్స్, యాంటీ ఫ్యాన్స్, హేటర్స్ గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రతి మనిషికి ఒక రోజు 100 శాతం ఎనర్జీ, సమయం ఉంటుందని, దానిని ఎలా ఉపయోగించుకోవాలనేది పూర్తిగా వారి వ్యక్తిగత నిర్ణయమని చెప్పారు. “ఎవరైనా నచ్చకపోతే వారిని ద్వేషిస్తూ, ట్రోల్ చేస్తూ మీ సమయాన్ని వృథా చేసుకోవద్దు. మీకు ఉన్న సమయం, శక్తి, అవకాశాలను మీకు నచ్చిన పనికే వినియోగించండి. నచ్చని విషయాల కోసం ఒక్క శాతం కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మీ జీవితాన్ని ఆనందంగా గడపడానికి, మీ లక్ష్యాలపై దృష్టి పెట్టడానికి ఆ సమయాన్ని ఉపయోగించుకోండి” అని అల్లు అర్జున్ అభిమానులకు సూచించారు.
Also Read
- Jailer 2 Telugu Trailer: 'జైలర్ 2' ట్రైలర్‌తో రజనీకాంత్ మాస్ తాండవం! అయినా కానీ..
- Hanuman Ansh: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైలర్!
- Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
- Ramayana: ‘రామాయణం’ సెట్లో భారీ అగ్నిప్రమాదం.. అసలేం జరిగిందంటే?
My Dear Fansss… 🖤
Seeing all of you coming from different places for this event is really heart touching. Thank you for all the love. Humbled . Hope to make you all more mad proud. 🖤 pic.twitter.com/HV9mHSA9aW— Allu Arjun (@alluarjun) July 28, 2026
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!