Liquor Seized: ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత తెలుగు రాష్ట్రాలతో పాటు.. దేశవ్యాప్తంగా విస్తృతంగా పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.. ఇక, తెలుగు రాష్ట్రాల్లో భారీగా మద్యం, డబ్బులు సీజ్ చేస్తూ వస్తున్నారు పోలీసులు.. ఇక, ఈ రోజు చిత్తూరు జిల్లా కుప్పంలో భారీ ఎత్తున మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.. కుప్పంలో ఎన్నికల వేల భారీస్థాయిలో మద్యం దొరకడం చర్చగా మారింది.. కర్ణాటక నుండి గుడుపల్లి మండలం సోడిగానీపల్లికి ఈ మద్యం తరలిస్తున్నట్టు అధికారులు గుర్తించారు.. ఎన్నికల్లో ఓటర్లకు ప్రలోబపెట్టేందుకు ఈ మద్యం తరలిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు.. ఈ రోజు పట్టుకున్న మద్యం విలువ దాదాపు రూ.6 లక్షలకు పైగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు పోలీసులు.. ఒక ద్విచక్ర వాహనం, ఒక కారును సీజ్ చేసిన SEB పోలీసులు.. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.. మద్యం బాటిళ్లను సీజ్ చేశారు. కాగా, ఎన్నికలు వచ్చాయంటే చాలు.. తెలుగు రాష్ట్రాల్లో మద్యం ఏరులైపారడమే కాదు.. డబ్బులతో కూడా ఓటర్లను ప్రభావితం చేస్తున్నవిషయం విదితమే.. పార్టీలతో సంబంధం లేకుండా ఈ వ్యవహారం నడుస్తోంది.. అధికార యంత్రాంగం పటిష్టచర్యలు చేపట్టినా.. ఇవి జరుగుతూనే ఉన్నాయి.
Read Also: Current Bil : కరెంట్ బిల్లు కట్టని ఎమ్మెల్యే.. ఇల్లు, ఆఫీసులకు కనెక్షన్ కట్