Kalyana Lakshmi: కళ్యాణలక్ష్మి–షాదీ ముబారక్ కోసం అడ్డదారులు.. గుట్టురట్టు చేసిన పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను లక్ష్యంగా చేసుకుని, అక్రమాలకు పాల్పడుతున్న ఒక నకిలీ ధ్రువీకరణ పత్రాల ముఠాను కామారెడ్డి జిల్లా పోలీసులు విజయవంతంగా అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుల నుంచి పలు నకిలీ రబ్బరు స్టాంప్స్, కంప్యూటర్ పరికరాలు, కీలకమైన డిజిటల్ ఆధారాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మోసం ఎలా బయటపడింది..?
నిందితులు ప్రభుత్వ వైద్యాధికారుల పేర్లను, వారి సంతకాలను ఫోర్జరీ చేసి నకిలీ ధ్రువీకరణ పత్రాలను తయారు చేశారు. ఈ నకిలీ పత్రాలను ఉపయోగించి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కోసం ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించినట్లు విచారణలో తేలింది. అనర్హులకు ప్రభుత్వ ధనాన్ని చేరవేసేందుకు ఈ అక్రమ ముఠా భారీ ఎత్తున కుట్ర పన్నినట్లు పోలీసులు గుర్తించారు.
Also Read
- ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
- PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
- OTR: ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీలో కుమ్ములాట ..అసలు కథేంటి?
- Trump-Jinping: ఇరాన్‌కు సాయపడడం భావ్యం కాదు.. జిన్‌పింగ్‌కు ట్రంప్ హితవు
జిల్లా ఎస్పీ హెచ్చరిక..
ప్రభుత్వ సంక్షేమ పథకాలను దుర్వినియోగం చేసేవారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర హెచ్చరించారు. అర్హులైన పేదలకు అందాల్సిన ఆర్థిక సహాయాన్ని నకిలీ పత్రాలతో కాజేయాలని చూస్తే ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు. భవిష్యత్తులోనూ ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలపై నిఘా మరింత కఠినతరం చేస్తామని ఎస్పీ పేర్కొన్నారు. ప్రజలు కూడా ఇటువంటి మోసపూరిత ముఠాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తాజావార్తలు
-
Chiranjeevi : నానమ్మ, తాతయ్యల జీన్స్ వచ్చాయి.. జాసన్ సంజయ్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Chiranjeevi : ఫరియా,.. నన్ను తొక్కేయాలని చూస్తున్నావా?
-
ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
-
PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
-
OTR: టీడీపీ-వైసీపీ ‘జెంటిల్మెన్ అగ్రిమెంట్’?రామేశ్వరం మెట్టపై హాట్ డిస్కషన్..
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!