Heavy Rain Alert: కాసేపట్లో హైదరాబాద్‌లో కుండపోత.. అత్యవసరమైతేనే బయటకు రండి.!
- మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాలో భారీ వర్ష సూచన
- బాచుపల్లి, కుతుబుల్లాపూర్ సహా పలు ప్రాంతాలకు అలర్ట్
- పశ్చిమ, మధ్య హైదరాబాద్‌కు విస్తరించే అవకాశం
- ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని అధికారుల సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Heavy Rain Alert: మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాతో పాటు హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ హెచ్చరికలు జారీ అయ్యాయి. ముఖ్యంగా బాచుపల్లి, కుతుబుల్లాపూర్, జీడిమెట్ల, కొంపల్లి, మేడ్చల్, గండిమైసమ్మ, దుండిగల్, బహదూర్‌పల్లి, గుండ్లపోచంపల్లి, హకీంపేట్, షామీర్పేట్, తూర్కపల్లి, కండ్లకోయ, బౌరంపేట్, మల్లాంపేట్ తదితర ప్రాంతాల్లో కొద్దిసేట్లోనే భారీ వర్షం కురిసే అవకాశం ఉందనడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇప్పటికే కుతుబుల్లాపూర్, గాజులరామారం, అల్వాల్, మేడ్చల్, బాచుపల్లి పరిసర ప్రాంతాల్లో కుండపోత వర్షం ప్రారంభమవ్వగా, రాబోయే గంటలో ఈ వర్ష ప్రభావం హైదరాబాద్ లోని పలు ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉంది.
నగరంలో మోస్తరు నుండి తీవ్రమైన వర్షాలు పడే సూచనలు ఉన్నందున ప్రజలు తమ ప్రయాణాలను తగిన విధంగా ప్రణాళిక వేసుకోవాలని అధికారులు కోరారు. సాయంత్రం వేళల్లో వర్ష తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నందున, అత్యవసర పనులు ఉంటే తప్ప ప్రజలు బయటకు రావద్దని హెచ్చరిస్తున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు డ్రైవింగ్ చేసేటప్పుడు, నీరు నిలిచే ప్రాంతాల గుండా వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Also Read
- Kavitha: సిరిసిల్లకు సీఎం ఏం ఇచ్చారు?.. సర్కార్‌పై కవిత విమర్శలు..!
- Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
- Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
- Bribe in Dead Drop Method: డెడ్ డ్రాప్ పద్ధతిలో లంచాలు.. టౌన్ ప్లానింగ్ అధికారి సునీత ట్రాప్‌లో సంచలన విషయాలు.!
తాజావార్తలు
-
Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Dangerous School Journey: వాగు దాటితేనే బడి.. చిన్నారుల సాహస ప్రయాణం చూస్తే గుండె తరుక్కుపోవాల్సిందే
-
Mahindra BE 07, Thar: మహీంద్రా Electric SUVలు టెస్టింగ్‌లో.. BE 07, Thar EVలో 500Km రేంజ్, అదిరిపోయే ఫీచర్లు!
-
vivo X Fold6: 200MP కెమెరా.. 6900mAh బ్యాటరీ.. vivo కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది! ఫీచర్లు అదిరిపోయాయ్
ట్రెండింగ్
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!