Kitchen Cleaning Hacks: మిక్సర్ బేస్ శుభ్రం చేసే బెస్ట్ ట్రిక్స్.. మురికి, దుర్వాసనకు గుడ్‌బై
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kitchen Cleaning Hacks: ప్రతి ఇంట్లో రోజూ ఎక్కువగా ఉపయోగించే వంటగది పరికరాల్లో మిక్సర్ గ్రైండర్ ఒకటి. మసాలాలు, పచ్చళ్లు, జ్యూస్‌లు, పిండులు తయారు చేయడం వంటి అనేక పనులకు ఇది ఉపయోగపడుతుంది. అయితే మిక్సర్ జార్‌ను శుభ్రం చేయడం సులభమే అయినా, మిక్సర్ బేస్‌లో జార్ అమర్చే కప్లర్ (తిరిగే రింగ్) చుట్టూ పేరుకుపోయే మురికిని శుభ్రం చేయడం చాలా కష్టంగా ఉంటుంది. మసాలాలు, నూనె, నీరు కలిసి అక్కడ జిడ్డుగా పేరుకుపోయి మొండి మురికిగా మారుతుంది. దీంతో.. కుక్కర్ జోలికి వెళ్లాలంటేనే కొన్నిసార్లు చిరాకుగా అనిపిస్తుంది.. కొన్నిసార్లు దుర్వాసన కూడా ఇబ్బందిపెడుతుంది.. అయితే కొన్ని సులభమైన చిట్కాలతో ఈ మురికిని సులభంగా తొలగించవచ్చు.
పాత టూత్‌బ్రష్‌తో శుభ్రం చేయండి
మిక్సర్ కప్లర్‌ను శుభ్రం చేయడానికి పాత టూత్‌బ్రష్ చాలా ఉపయోగపడుతుంది. ముందుగా బ్రష్‌పై కొద్దిగా గిన్నెలు కడిగే లిక్విడ్ లేదా డిష్‌వాష్ ద్రావణం వేయాలి. తర్వాత కప్లర్ చుట్టూ ఉన్న మురికిని మెల్లగా రుద్దాలి. బ్రష్ చిన్న చిన్న మూలల్లోకి చేరి పేరుకుపోయిన జిడ్డును సులభంగా తొలగిస్తుంది. చివరగా పొడి, శుభ్రమైన గుడ్డతో తుడిచి తేమ లేకుండా చేయాలి.
Also Read
- Cinnamon Plant: మార్కెట్ దాల్చిన చెక్కకు గుడ్ బై.. ఇంట్లోని కుండీలోనే సులువుగా పెంచేయండిలా..
- Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
- Japanese Kitchen Cleaning Tips: గిన్నెలు తోమడం ఇక చాలా తేలిక.. జపాన్ ప్రజలు పాటించే సింపుల్ ఆర్డర్ ఇదే!
- Jelly Bangles Designs: ఇప్పుడు ఈ గాజులే ట్రెండ్.. కుర్తీ, జీన్స్, చీర.. ప్రతి డ్రెస్‌కు సరిపోయే డిజైన్లు.. ఇలా ట్రై చేయండి..
బేకింగ్ సోడా పేస్ట్‌తో మొండి మురికి తొలగించండి
ఎన్నో రోజులుగా పేరుకుపోయిన గ్రీజు, మురికి ఉంటే బేకింగ్ సోడా మంచి పరిష్కారం. కొద్దిగా బేకింగ్ సోడాలో నీరు కలిపి చిక్కటి పేస్ట్ తయారు చేయాలి. ఈ పేస్ట్‌ను కప్లర్ చుట్టూ రాసి 5 నుంచి 10 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. అనంతరం టూత్‌బ్రష్‌తో మెల్లగా రుద్దితే మొండి మురికి కూడా సులభంగా తొలగిపోతుంది. చివరగా తడి గుడ్డతో తుడిచి, ఆ తర్వాత పొడి గుడ్డతో పూర్తిగా ఆరబెట్టాలి.
వెనిగర్‌తో దుర్వాసనకు చెక్
మిక్సర్ బేస్‌లో తేమ ఎక్కువసేపు ఉండటం వల్ల దుర్వాసన వచ్చే అవకాశం ఉంటుంది. దీనిని నివారించేందుకు సమాన పరిమాణంలో తెల్ల వెనిగర్ మరియు నీటిని స్ప్రే బాటిల్లో కలపాలి. ఆ ద్రావణాన్ని కప్లర్ చుట్టూ స్వల్పంగా స్ప్రే చేసి కొద్దిసేపటి తర్వాత బ్రష్‌తో శుభ్రం చేయాలి. ఇలా చేయడం వల్ల మురికి తొలగడమే కాకుండా బ్యాక్టీరియా కూడా తగ్గుతుంది. అయితే ద్రావణం మోటార్‌లోకి వెళ్లకుండా జాగ్రత్తపడాలి.
ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించండి
మిక్సర్ బేస్‌ను ఎప్పుడూ నేరుగా కుళాయి కింద కడగకూడదు. అలాగే నీటిలో ముంచకూడదు. అలా చేస్తే మోటార్‌లోకి నీరు వెళ్లి పరికరం దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. కప్లర్‌ను శుభ్రం చేసిన తర్వాత పూర్తిగా ఆరిన తర్వాతే మళ్లీ ఉపయోగించాలి. తేమ మిగిలితే తుప్పు పట్టడం లేదా లోపలి భాగాలు దెబ్బతినే అవకాశం ఉంది. తడి గుడ్డతో శుభ్రం చేసే సమయంలో కూడా గుడ్డలో నీరు ఎక్కువగా ఉండకుండా బాగా పిండి వాడాలి.
మిక్సర్ గ్రైండర్‌ను కేవలం జార్ మాత్రమే కాకుండా బేస్, కప్లర్ భాగాన్ని కూడా క్రమం తప్పకుండా శుభ్రం చేస్తే పరికరం ఎక్కువకాలం మన్నికగా ఉంటుంది. పాత టూత్‌బ్రష్, బేకింగ్ సోడా, వెనిగర్ వంటి ఇంట్లోనే అందుబాటులో ఉండే వస్తువులతో మిక్సర్ బేస్‌ను సులభంగా శుభ్రం చేసి కొత్తదానిలా మెరిసేలా ఉంచుకోవచ్చు. దీంతో మురికి, దుర్వాసన, బ్యాక్టీరియా సమస్యల నుంచి కూడా రక్షణ పొందవచ్చు. పేరుకుపోయిన మొండి మరకలు, జిడ్డు.. దుర్వాసనతో ఇబ్బందులకు చెక్ పెట్టి.. రోగాలబారిన పడకుండా చూసుకోవచ్చు..
తాజావార్తలు
-
Manchu Manoj: మంచు మనోజ్ కొత్త సినిమా.. పోతరాజు నేపథ్యంలో భారీ బడ్జెట్‌తో డివైన్ యాక్షన్ థ్రిల్లర్!
-
Mohan Bhagwat: స్మిత్ మచ్చర్ హిందూ విలువలకు నిదర్శనం.. ఆర్ఎస్ఎస్ చీఫ్ ప్రశంసలు..
-
Kim Jong Un Death Rumors: కిమ్ జోంగ్ ఉన్ మృతిపై పుకార్లు.. కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
-
SS Rajamouli-Varanasi: ఆరేడు సినిమాలను కలిపి ఒకే చిత్రంగా.. ‘వారణాసి’పై రాజమౌళి ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
-
Dussehra astrology: దసరా నుంచి ఈ 3 రాశుల వారికి త్రిగ్రాహి, లక్ష్మీనారాయణ, బుధాదిత్య యోగాలు..
ట్రెండింగ్
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!
-
New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!
-
WPL 2027 Auction: 27 స్థానాల కోసం 146 మంది ప్లేయర్లు.. WPL వేలం తేదీ, వేదిక ఖరారు..!